📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి మెక్సికోలో భూకంపం ఈరోజు నుంచి తెలంగాణ టెట్ బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ రూ. 500 నోట్లు బంద్.. రూమర్స్‌పై కేంద్ర ప్రభుత్వం వివరణ సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ న్యూ ఇయర్ దాడి కుట్ర విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం

AP: మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసిన ప్రభుత్వం?

Author Icon By Aanusha
Updated: January 3, 2026 • 8:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉద్యోగుల వైద్య బిల్లుల చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు వరకు ఉన్న అన్ని మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను క్లియర్ చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో దినేష్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపై ఈహెచ్ఎస్ ఆరోగ్య కార్డుల్లో మార్పులు, చేర్పులను ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే సులభంగా చేసుకోవచ్చు.

Read also: AP: ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి

పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు

ఉద్యోగులతో సమావేశంలో.. ఉద్యోగుల వైద్య బిల్లులు, హెల్త్‌ కార్డులు, నెట్‌వర్కింగ్‌ ఆస్పత్రుల్లో చికిత్సలపై దినేష్ కుమార్ చర్చించారు. ప్రభుత్వం ఉద్యోగుల వైద్య బిల్లులను వీలైనంత త్వరగా పరిష్కరించి.. పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించడానికి చర్యలు తీసుకుంటోందన్నారు.14 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులను ఆగస్టు నాటికి పూర్తిగా క్లియర్ చేశామని ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు సీఈవో దినేష్ కుమార్ తెలిపారు.ఈహెచ్‌ఎస్‌కు సంబంధించిన మొత్తం సమాచారం, మెడికల్ బిల్లుల తాజా పరిస్థితిని ఇకపై వాట్సప్‌ ద్వారా ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు పంపిస్తామన్నారు.

AP: Has the government cleared the medical reimbursement bills?

అలాగే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈహెచ్‌ఎస్‌ ఆరోగ్య కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ఉద్యోగులకు ఇప్పుడు ఆన్‌లైన్ సౌకర్యం కల్పించారు. దీనివల్ల ఉద్యోగులు తమ ఆరోగ్య కార్డులకు సంబంధించిన వివరాలను ఎప్పుడైనా, ఎక్కడైనా మార్చుకునే వీలుంటుంది. ఇది ఉద్యోగులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు తెలిపారు. మొత్తం మీద బిల్లులు చెల్లించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh government employees EHS health scheme latest news medical reimbursement bills NTR Vaidya Seva Trust Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.