AP Handlooms : భారతీయ చేనేత, హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా (Worldwide) మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని హ్యాండ్లూమ్, క్రాఫ్ట్స్ అభివృద్ధికి నిర్దేశించిన సలహాదారు సుచిత్ర ఎల్ల తెలిపారు. ‘గాంధీ బునకర్ మేళా ‘(జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన – 2025) ను విజయవాడ శేష సాయి కళ్యాణ వేదికలో సుచిత్ర ఎల్ల, చేనేత, జౌళి శాఖ కమిషనర్ జి. రేఖా రాణి, 8వ డివిజన్ కార్పొరేటర్ చెన్ను పాటి ఉషారాణిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినసభలో జ్యోతి ప్రజ్వలనచేసారు.. ఈ సందర్భంగా సుచిత్ర మాట్లాడుతూ చేనేత మరియు హస్తకళల ప్రొడక్ట్స్ ను జాతీయ, అంతర్జాతీయంగా మార్కెట్ చేసేందుకు బాధ్యత తీసుకుని పనిచేస్తామన్నారు. మన వస్తువులకు బ్రాండింగ్ ఎలా చేయాలో వాటికి ఇంకా ఆదరణ ఎలా చేయాలో అనే విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. మన కళలను, ఆర్టిజన్ను, హ్యాండీ క్రాఫ్ట్స్ ను అభివృద్ధి చేయటం మనందరి బాధ్యత అని అన్నారు.
చేనేత రంగానికి గుర్తింపు: వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్ క్రింద 10 అవార్డులు
మన కుటుంబాలు చేనేతను ఆదరించేలా చేయాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. హ్యాండ్ ల్యూమ్స్ ఒక జీవనో పాధి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్ క్రింద మన చేనేతకు 10 అవార్డ్స్ రావడం చేనేతకు గర్వకారణం అన్నారు. మొత్తం దేశంలో 30 అవార్డ్స్ మనకు 10 అవార్డులు (Awards) రావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఇందులో బాపట్ల జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు, రాష్ట్రంలో 9 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ జి. రేఖా రాణి మాట్లాడుతూ చేనేత ఉత్పత్తులను పెంచేందుకు ఇలాంటి ఎగ్జిబిషను ఆగస్టు నెలలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి జిఎస్టీ రీయింబర్స్ మెంట్ కోసం ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. చేనేత కార్మికులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించి మరియు దేశములోని ప్రముఖ చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపై తీసుకువచ్చి వినియోగదారులకు అందుబాటులో ఉంచే కార్యక్రమములో భాగంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చేనేత, జౌళిశాఖ అడిషనల్ డైరెక్టర్ మురళీకృష్ణ, జాయింట్ డైరెక్టర్ రాజారావు, డిప్పూటీ డైరెక్టర్ బి. నాగేశ్వరరావు, ఏడీలు హరికృష్ణ, వనజ, తదితరలు పాల్గొన్నారు.
‘గాంధీ బునకర్ మేళా’ను (జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2025) జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన2025 అనంతరం చేనేత వస్త్ర ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ను ఆసక్తిగా గమనించారు. అంతేకాకుండా ఒక్కో చీర తయారీకి ఎన్ని రోజులు వడుతుంది, ఎంత మంది చీర తయారీలో పాల్గొంటారు అని స్టాల్స్ నిర్వాకులను అడిగి తెలుసుకున్నారు.
విజయవాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన: దేశవ్యాప్తంగా 100 స్టాల్స్
ఈ ప్రదర్శనలో దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల నుంచి 100 స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శనలో బీహార్, చత్తీస్గఢ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, గుజరాత్, ఢిల్లీ, హ్యాండిక్రాఫ్ట్స్ విభాగంలో 5, ఆంధ్రరాష్ట్రం నుండి 45 చేనేత సంఘాలు పాల్గొననున్నాయి. ఈ వస్త్ర ప్రదర్శనలో అన్నిరకాల చేనేత ఉత్పత్తులు ఉత్పత్తి ధరలకే అందుబాటులో ఉంచబడును. కాటన్/ సిల్క్ చీరలు, డ్రస్ మెటీరియల్స్, బెడ్ షీట్లు, కలంకారి, జంథాని, కార్పెట్స్ వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులు ఈ మేళాలో ప్రదర్శన. అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. కావున, మన విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకుని, చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి, చేనేత కార్మికులను ప్రోత్సహించవలసిన అవసరం ఉంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :