ఆంధ్రప్రదేశ్ (AP) లో ఇంటర్‌మీడియట్ విద్యార్థులకు కీలకమైన సమాచారం వెలువడింది. రాబోయే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు 2 సెషన్లలో (9.00 AM-12.00PM, 2.00PM-5.00PM) ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్/ ఆధార్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
Read Also: Chandra babu: స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
సూచనలు
వెబ్‌సైట్‌లో, మన మిత్ర సర్వీసు(9552300009)లో అందుబాటులో ఉన్నట్లు చెప్పింది.హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, అందులో విద్యార్థి పేరు, ఫోటో, సంతకం, పరీక్ష కేంద్రం పేరు, కేటాయించిన తేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ ను -సంప్రదించాలని బోర్డు సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: