📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: అంబటి రాంబాబుకు ఊరట గుంటూరు కోర్టు బెయిల్

Author Icon By Saritha
Updated: February 11, 2026 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ నేత (AP) అంబటి రాంబాబుకు (Ambati Rambabu) గుంటూరు కోర్టులో ఊరట లభించింది. సీఐ విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో, ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

Read Also: Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్యేలపై అయ్యన్న సెటైర్లు

కోర్టు ఉత్తర్వులతో రేపు విడుదలయ్యే అవకాశం 

(AP) గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న సీఐని అడ్డుకున్నారని అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ కావడంతో, పట్టాభిపురం పోలీసులు మూడు రోజుల క్రితం ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన గుంటూరు కోర్టు, తాజాగా అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, కోర్టు ఉత్తర్వులతో రేపు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ambati rambabu Andhra Pradesh bail granted Guntur court Latest News in Telugu legal case Telugu News YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.