📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP GST: ఏపీలో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

Author Icon By Anusha
Updated: July 2, 2025 • 2:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం శక్తివంతంగా దూసుకుపోతోంది. దీనికి ప్రధాన కారణం జీఎస్టీ వసూళ్లలో కనిపిస్తున్న విశేషమైన పెరుగుదల. జూన్ 2025 నెలలో రాష్ట్రానికి వసూలైన జీఎస్టీ పన్నులు కొత్త రికార్డును నెలకొల్పాయి. ఈ ఒక్క నెలలో రాష్ట్రానికి రూ.4,167.66 కోట్ల పన్నులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఒకే నెలలో ఈ స్థాయిలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ పన్నులు గతేడాది కంటే రూ.258 కోట్లు ఎక్కువ. వాణిజ్య పన్నుల శాఖ (Commercial Taxes Department) తీసుకున్న చర్యలు, ఏఐ వాడకం వల్ల ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. 2024 జూన్ నెలలో వచ్చిన పన్నుల కంటే ఈసారి ఎక్కువ వసూలు అయ్యాయి. 2024 జూన్‌లో రూ.3,910.47 కోట్ల పన్నులు వసూలు కాగా, ఈ ఏడాది రూ.4,167.66 కోట్లు వచ్చాయి. అంటే దాదాపు 6.58% ఎక్కువ వసూలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో కూడా మంచి వసూళ్లు జరిగాయి గతేడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి మెరుగ్గా ఉంది.

ఫలితాలను ఇస్తున్నాయని సరైన పర్యవేక్షణ

మొదటి మూడు నెలల్లో రాష్ట్రానికి రూ.8,860 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయంలో వచ్చిన ఆదాయం కంటే ఇది 3.4% ఎక్కువ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందన్నారు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్. వాణిజ్య పన్నుల శాఖ తీసుకున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నాయని సరైన పర్యవేక్షణ, లక్ష్యాలు సాధించేలా ఎంచుకున్న విధానాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. గతేడాదితో జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో జీఎస్టీ 7.10% పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సూచన మేరకు వాణిజ్య పన్నుల శాఖ ఏఐని వాడుతోంది. పన్నులు సులువుగా చెల్లించడానికి ఏఐ ఉపయోగపడుతుంది.

AP GST: ఏపీలో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు

అధికారులకు పన్నుల వసూళ్లకు సంబంధించి

జీఎస్టీ చెల్లింపులు పారదర్శకంగా ఉండేలా చూస్తున్నారు. పన్నుల్లో తేడాలు, సమస్యలను తనిఖీ చేయడానికి ఆటోమేషన్ విధానం (Automation system) పెట్టారు. వాహనాల తనిఖీలు చేస్తూ పన్ను ఎగ్గొట్టే వారిని పట్టుకుంటున్నారు. ఏఐ, డేటా ఎనలిటిక్స్‌తో జీఎస్టీ వసూళ్లలో అక్రమాలు జరగకుండా చూస్తున్నాము. అధికారులకు పన్నుల వసూళ్లకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించి, వారి పనితీరు ఆధారంగా సంస్థలో బదిలీలు కూడా చేపట్టాం. సిబ్బంది పనితీరు కూడా మెరుగైన పన్నుల రాబడికి తోడ్పడింది’ అని తెలిపారు.

Read Also: Vamsi: ఎట్టకేలకు సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి భారీ ఊరట

#AIinGovernance #AndhraEconomy #APFinance #CommercialTaxes #economicgrowth #FiscalPerformance #GovernmentRevenue #GST2025 #GSTCollectionRise** #GSTRevenue #JuneGST #RecordCollections #RevenueIncrease #TaxRevenue Google news Here are English hashtags with relevant keywords separated by commas based on your content: **#AndhraPradesh Telugu News Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.