📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP Govt Jobs 2026: నిరుద్యోగులకు ఉగాది కానుక.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

Author Icon By Anusha
Updated: March 19, 2026 • 10:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP Govt Jobs 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అదిరిపోయే శుభవార్త అందించింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పండగ పూట వచ్చిన ఈ ప్రకటనతో నిరుద్యోగ అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Read Also: AP Govt News: పోలవరం నిర్వాసితులకు నిధులు విడుదల: సీఎం

యువగళం హామీ నెరవేర్చిన నారా లోకేశ్

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ ‘ఉద్యోగాల పండగ’ను ప్రకటించారు. తన ‘యువగళం’ పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన మాట ప్రకారం, ఇప్పుడు 10,060 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.

స్పష్టమైన జాబ్ క్యాలెండర్ విడుదల

ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటి నోటిఫికేషన్లు ఏ తేదీన విడుదలవుతాయి అనే పూర్తి వివరాలతో కూడిన జాబ్ క్యాలెండర్‌ను మంత్రి వివరించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి, పారదర్శకంగా పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థుల సౌకర్యార్థం సిలబస్‌ను కూడా ముందుగానే అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు.

ఉద్యోగార్థులు అందరూ ‘నైపుణ్యం పోర్టల్’ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన అలర్ట్స్ పొందవచ్చని సూచించారు. ఇకపై ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుందని, లోకేశ్ అన్నారు. అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Recruitment 2026 AP 10060 Jobs AP Govt Jobs 2026 Nara Lokesh Job Calendar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.