📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Telugu News: AP Govt: రేషన్ కార్డుదారులకు శుభవార్త – జనవరి నుంచి కొత్త సరకులు

Author Icon By Pooja
Updated: December 9, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రేషన్ కార్డు(Ration card) కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం పెద్ద అప్డేట్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరా వ్యవస్థలో విస్తృత మార్పులు చేసింది. గతంలో వాహనాల ద్వారా సరఫరా చేసిన పద్ధతిని పూర్తిగా మార్చి, మళ్లీ రేషన్ దుకాణాలను(AP Govt) ప్రజలకి దగ్గరగా తీసుకొచ్చింది. లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. ఇక కొన్ని ప్రాంతాల్లో ఈ రేషన్ దుకాణాలను మినీ మాల్స్‌గా మార్చే దిశగా ప్రభుత్వం ప్రాయోగిక చర్యలు ప్రారంభించింది.

Read Also:  AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతిష్టను దిగజార్చేందుకు భారీ కుట్ర

అదే సమయంలో, రేషన్‌లో అందించే సరకుల పరంగా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం(AP Govt) అన్ని చౌకధరల దుకాణాల ద్వారా ఇప్పటికే ఇస్తున్న బియ్యం, పంచదారతో పాటు జనవరి 1 నుంచి రాగులు, గోధుమ పిండి కూడా అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ రెండు సరకులను నవంబర్ నుంచి కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇవ్వగా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ నుంచి అనుమతి లభించింది.

Good news for ration card holders – new supplies from January

దిల్లీలో కేంద్రమంత్రి జోషీతో సమావేశమైన మంత్రి మనోహర్‌ మాట్లాడుతూ, జనవరి నుంచి పీడీఎస్ బియ్యం బస్తాలను క్యూఆర్ కోడ్ ట్యాగ్‌లతో అందజేస్తామని తెలిపారు. దీతో అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోగలమని అన్నారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసే బియ్యం బస్తాలపై ఈ క్యూఆర్ ట్యాగింగ్ పద్ధతి అమల్లో ఉందని ఆయన చెప్పారు.

ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపినట్లుగా మంత్రి వివరించారు. అందులో 17.30 లక్షల టన్నుల కొనుగోలు పూర్తి జరిగిందని తెలిపారు. 2.60 లక్షల మంది రైతులకు రూ. 4,120 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ అయ్యాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,550 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 16 వేల మంది సిబ్బంది, 32 వేల రవాణా వాహనాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రైతులకు అవసరమైన 7.85 కోట్ల గోనె సంచులు అందజేసినట్లు మంత్రి మనోహర్ చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

FoodSecurity Google News in Telugu Latest News in Telugu QRcodeRation RationUpdate

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.