మొంథా తుఫాను ప్రభావంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) ఆర్థిక సాయం ప్రకటించింది. తుఫాన్ కారణంగా ఇళ్లను కోల్పోయి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న బాధితులందరికీ ప్రభుత్వం ప్రత్యక్ష ఆర్థిక సాయం అందించనుంది.
Read Also: Rain Alert: జమైకాలో మెలిస్సా తుపాను విధ్వంసం
పునరావాస కేంద్రాల రూ.1000 చొప్పున – కుటుంబానికి గరిష్ఠంగా రూ.3000 సహాయం
తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, పునరావాస కేంద్రాలకు వచ్చిన ప్రతి వ్యక్తికి రూ.1000 చొప్పున నగదు సాయం ఇవ్వాలని ప్రభుత్వం(AP Govt) నిర్ణయించింది. ఒక కుటుంబంలో ముగ్గురికి పైగా ఉన్నట్లయితే, గరిష్ఠంగా రూ.3000 వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ సాయం పునరావాస కేంద్రాల నుంచి బాధితులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు అందించబడుతుంది.
ఇక పంట నష్టాలు, ఇళ్ల దెబ్బతినడం, విద్యుత్(Electricity,), తాగునీరు, రవాణా వంటి రంగాల్లో జరిగిన నష్టాలను అంచనా వేయడానికి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధితుల పునరావాసానికి ప్రభుత్వం అన్ని వనరులను వినియోగిస్తుందని స్పష్టం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: