AP Kerosene distribution: ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ గ్యాస్ కొరత కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
Read Also: Kakani Govardhan Reddy: మత్స్యకారులకు అన్యాయం చేస్తే ఊరుకోం.. కూటమి సర్కార్‌పై కాకాణి నిప్పులు!
మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి
ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించడానికి రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల అధికారికంగా వెల్లడించారు. మార్చి 23 (సోమవారం) నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

AP Kerosene distribution: గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత
తొలి దశలో భాగంగా మారుమూల ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో ఈ కిరోసిన్ పంపిణీ చేపట్టనున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఒక్కో రేషన్ కార్డుపై ఒక లీటర్ చొప్పున కిరోసిన్ అందించనున్నారు. గ్యాస్ సిలిండర్ల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో ఊరటనివ్వనుంది.
రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2800 లీటర్ల కిరోసిన్ కేటాయించింది. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెలలోని రేషన్ కార్డుదారులకు కిరోసిన్ పంపిణీ చేయనున్నారు.మరోవైపు రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని ఏపీ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గ్యాస్ నిల్వల గురించి వచ్చే వదంతులు నమ్మవద్దని నాదెండ్ల మనోహర్ కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: