ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఇటీవల కార్మికుల పని గంటలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని పరిశ్రమలు, షాపులు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రోజుకు 8 గంటల బదులు 10 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ నూతన నియమం నిన్నటి నుంచే అమల్లోకి వచ్చినట్లు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Jogi Ramesh: ఎస్సైపై హెచ్చరికలు చేసిన జోగి రమేష్ కుమార్తె
ప్రభుత్వం (AP Govt) తీసుకున్న ఈ నిర్ణయం కార్మిక వర్గంలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ప్రభుత్వ వర్గాలు చెబుతున్న ప్రకారం ఈ నిర్ణయం పారిశ్రామిక ఉత్పాదకత పెంచడమే లక్ష్యంగా తీసుకున్నదని పేర్కొన్నాయి. అదే సమయంలో, వారం మొత్తం పని గంటలు 48 గంటలు దాటితే, అదనపు గంటలకు ఓవర్‌టైమ్ (OT) కింద చెల్లింపులు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
అంటే, రోజువారీ 10 గంటల పని ఉన్నప్పటికీ, వారపు మొత్తం సమయం 48 గంటలను మించరాదు. మించిన పక్షంలో యజమానులు అదనపు చెల్లింపులు చేయాల్సిందే.మరోవైపు ఐదు మంది కంటే ఎక్కువ మహిళలుంటేనే వారిని రాత్రి వేళ డ్యూటీలకు అనుమతించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: