ఏపీ (AP) లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, ఆన్‌లైన్ భద్రత దృష్ట్యా ఆస్ట్రేలియా అమలు చేస్తున్న ‘అండర్-16 బ్యాన్’ నమూనాను రాష్ట్రంలోనూ అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు.సైబర్ బుల్లీయింగ్, అశ్లీల కంటెంట్ ప్రభావం నుంచి పిల్లలను కాపాడేందుకు పటిష్టమైన చట్టం అవసరమని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.
Read Also: AP: హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్ జయశాంతి
కొన్ని ఇబ్బందులు
వయస్సు నిర్ధారణ సాంకేతికత, తల్లిదండ్రుల్లో అవగాహన పెంపుపై ఐటీ శాఖ కసరత్తు చేస్తోందని తెలిపారు. సోషల్ మీడియా వాడకాన్ని కట్టడి చేయాలని, హానికరమైన ఆన్‌లైన్ కంటెంట్‌ను అరికట్టాలని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చట్టపరమైన, సాంకేతికపరమైన అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పిటిషన్ల ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను మరింత కఠినతరం చేయాలని కోరుతున్నారు.
అలాగే, ఆన్‌లైన్‌లో వచ్చే ప్రమాదకరమైన సమాచారాన్ని అడ్డుకోవాలని డిమాండ్ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నియంత్రణలను అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాయి. చట్టపరమైన సమస్యలు, సాంకేతికపరమైన సవాళ్లు ఈ అమలుకు ఇబ్బందిగా మారతాయని పేర్కొన్నారు. మొత్తం మీద భారత్‌లో కూడా ఆస్ట్రేలియా తరహాలో పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ విధించాలనే డిమాండ్ మొదలైంది. మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: