ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం పెద్ద శుభవార్తను అందించింది. పట్టణాభివృద్ధి సంస్థల (UDA) పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలకు ఇకపై భూ వినియోగ మార్పిడి ద్వారా అదనపు ఆదాయం లభించబోతోంది. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం, భూవినియోగ మార్పిడికి ఎక్స్టెర్నల్ డెవలప్మెంట్ ఛార్జ్ (EDC) విధించాలని నిర్ణయించింది.
Read Also: Pawan Kalyan: సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రత్యేక బోర్డు అవసరం
పంచాయతీలకు న్యాయమైన వాటా అందేలా
ఈ విధానం ద్వారా వసూలు చేసే మొత్తంలో 15 శాతం పట్టణాభివృద్ధి సంస్థలకు (UDA) వెళ్తే, మిగిలిన 85 శాతం నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ అవుతుంది. ఇంతకు ముందు ఈ ఛార్జీలు పూర్తిగా UDA ఖాతాల్లోకి వెళ్తుండేవి. కానీ వాటి నుంచి గ్రామ పంచాయతీలకు వాటా తిరిగి ఇవ్వడం క్లిష్టమైన ప్రక్రియగా మారడంతో అధికారులు పలు సార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీలకు న్యాయమైన వాటా అందేలా, నగదు నేరుగా వారి ఖాతాల్లోకి జమ అయ్యేలా ప్రభుత్వం (AP) తాజా ఆదేశాలు జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: