📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

AP Government: ఉద్యోగుల హక్కులు పరిరక్షిస్తాం: మంత్రి ఎస్. సవిత

Author Icon By Rajitha
Updated: January 5, 2026 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బిసిల రక్షణ కోసం ‘బిసి రక్షణ చట్టం’: మంత్రి కొల్లు రవీంద్ర

సచివాలయం : కూటమి ప్రభుత్వం బిసి ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటూ వారికి ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తుందని రాష్ట్ర బిసి చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బిసి, ఓబిసి ఉద్యోగుల రాష్ట్ర మహాసభ కు మంత్రి సవిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బిసి ఉద్యోగుల క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశానికి మంచి సందేశం ఇచ్చేలా బిసి, ఓబిసి ఉద్యోగుల సదస్సు నిర్వహణ ఉందన్నారు. ఒక బిసి మంత్రిగా కార్యక్రమంలో పాల్గొనడం తనకు గర్వకారణమన్నారు. ఈ మహాసభను విజయవంతం చేసిన బిసి అసోసియేషన్ అధ్యక్షులు గుత్తుల వీరబ్రహ్మం, గౌరవాధ్యక్షులు అప్పారావు సహా ఇతర బిసి నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Read also: Vadde Obanna Jayanti: రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి

e will protect the rights of the employees

అభివృద్ధికి విద్యే కీలకమని

మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే ఆశయాలను రాష్ట్రంలో అమలు చేసిన తొలి నాయకుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని కొనియాడారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పించి వారు రాజకీయంగా పారిశ్రామికంగా ఎదిగేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒరవడిని కొనసాగిస్తూ బిసి ఉద్యోగుల పక్షపాతిగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగుల భయాలకు తావులేకుండా ప్రశాంతంగా పనిచేసే పరిస్థితి ఉందని భరోసా ఇచ్చారు. బిసి, ఓబిసి వర్గాల అభివృద్ధికి విద్యే కీలకమని, డిఎస్సీ, సివిల్ సర్వీసెస్ కోచింగ్లు, బిసి హాస్టళ్ళు, గురుకుల పాఠశాలల ఆధునికీకరణ ద్వారా ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు.

భవిష్యత్తులో బిసిల వైపు చూడాలంటే భయపడేలా

ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహించేలా ముఖ్యమంత్రితో చర్చిస్తానన్నారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా బిసి, ఓబిసి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా అమరావతిలో ఈ మహాసభ జరగడం చారిత్రాత్మక మన్నారు. గతంలో బిసిలపై జరిగిన అణచివేతకు ఈ సభ ధైర్యాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులో బిసిల వైపు చూడాలంటే భయపడేలా బిసీల రక్షణ కోసం ప్రత్యేక “బిసి రక్షణ చట్టం” తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. బిసి ఉద్యోగులతో 26జిల్లాల కమిటీలను వేయడం అభినందించాల్సిన విషయమన్నారు.

ఏప్రిల్ 11ను ప్రభుత్వ సెలవుగా ప్రకటించాలని

బిసి ఉద్యోగుల సంఘం నేత గుత్తుల వీరబ్రహ్మం మాట్లాడుతూ, రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యూలర్ విభాగాల్లో కలిపి 7లక్షల మంది బిసి ఉద్యోగులున్నారని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి ఏప్రిల్ 11ను ప్రభుత్వ సెలవుగా ప్రకటించాలని, బిసిలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు, క్రీమిలేయర్ తొలగింపు, బిసి అట్రాసిటి చట్టం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో బిసి వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ, బిసి, ఓబిసి ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ కేదారేశ్వరరావు, జనరల్ సెక్రటరీలు పి.శ్రీధర్, భూషణ్ రావు, ట్రెజరర్ వై.శంకర్రావు, 26జిల్లాల ఉద్యోగులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics bc employees BC welfare latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.