ఆంధ్రప్రదేశ్ (AP) లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుదిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.ఏఏఐ ఇప్పటికే కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలు ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక అధ్యయనాలను పూర్తి చేసినట్లు కేంద్రమంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు.
Read Also: Cancer Atlas : క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన చంద్రబాబు
రాజమండ్రి ఎయిర్‌పోర్టు
ఈ మూడు చోట్ల విమానాశ్రయాలు నిర్మించడానికి అవసరమైన భూమి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం.. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ విధానం కింద పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదనలు సమర్పించిందని.. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.రాజమండ్రి ఎయిర్‌పోర్టులోని కార్గో టెర్మినల్ సామర్థ్యంలో కేవలం 0.15% మాత్రమే ఉపయోగపడుతోందని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు.
లోక్‌సభలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ టెర్మినల్ ఏటా 17,200 టన్నుల సరుకు రవాణా చేయగల సామర్థ్యం కలిగి ఉండగా, 2024-25లో కేవలం 25 టన్నుల సరుకు మాత్రమే రవాణా అయ్యిందన్నారు. దీంతో అదనపు కార్గో సౌకర్యాలు కల్పించే ఆలోచన లేదన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: