📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest News Telugu: AP ఉద్యోగాల పేర్లు మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

Author Icon By Tejaswini Y
Updated: November 27, 2025 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌(AP)లో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులను ఇప్పటికీ పాతకాలంలో నిర్ణయించిన పోస్టుల పేర్లతోనే పిలుస్తున్నారు. కాలానుగుణంగా మార్పులు రాకపోవడంతో ప్యూన్, వాచ్‌మెన్, అటెండర్, స్కావెంజర్ వంటి కొన్ని పద్దుల పేర్లు ప్రస్తుతం అభ్యంతరకరంగా, గౌరవభంగానికి గురిచేసేవిగా భావించబడుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

పలువురు ఉద్యోగులు పనిచేస్తున్న విభాగాల్లో ఇలాంటి పేర్లు వాడటం, పిలవడం కూడా అసౌకర్యం కలిగిస్తోందని అధికారులు గుర్తించారు. సామాజిక మార్పులు, రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి గౌరవవంతమైన జీవన హక్కు, అలాగే గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుంటూ, అభ్యంతరకరమైన ఈ పోస్టుల పేర్లను మార్చాలని సర్కార్ నిర్ణయించింది.

Read Also: CM Chandrababu: రెండేళ్లలో అమరావతిలో వేంకటేశ్వర ఆలయం పూర్తి: సీఎం

Government orders changing job names

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించగా, వెంటనే చర్యలు తీసుకునేలా సీఎస్ విజయానంద్‌ను దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు తమ పరిధిలో ఉన్న పోస్టుల పేర్లను పరిశీలించి, కొత్త పేర్లకు సూచనలు ఇవ్వాలని ఆదేశించాయి.

కొత్త పేర్లకు ఆమోదం

సాధారణ పరిపాలన శాఖ ఇప్పటికే సుమారు 20 శాఖల్లో పేర్లు మార్చాల్సిన జాబితాను సిద్ధం చేసింది. ఇందులో పోలీసు(police), వైద్యారోగ్యం(medical health), జీఏడీ(GAD) వంటి శాఖల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఈ పేర్ల మార్పు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.

జీవోలో పేర్కొనబడని ఇతర అభ్యంతరకర పద్దులను కూడా ఒక వారం లోగా నివేదిక రూపంలో పంపాలని సీఎస్ ఆదేశించారు. మూడు వారాల్లో మొత్తం పరిశీలన పూర్తి చేసి, కొత్త పేర్లకు ఆమోదం తెలుపుతూ తాజా జీవో విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మార్పులు ప్రభుత్వ విభాగాలతో పాటు కార్పొరేషన్లు, బోర్డులు, సొసైటీలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలలోని పద్దులపైనా అమల్లోకి రానున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh Administration AP Government Chandrababu Naidu Government Employees Job title change Objectionable job titles

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.