📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP Govt: చిన్నారుల మృతి ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌

Author Icon By Aanusha
Updated: October 5, 2025 • 10:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసిన ఘటన ఇది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని బాలికల గురుకుల పాఠశాల (School) లో ఇద్దరు విద్యార్థినుల మృతిచెందడం, మరో 120 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురవడం పెద్ద కలకలాన్ని రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పిల్లలను గురుకుల పాఠశాలలకు పంపడం సురక్షితమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Huge Scam : కడపలో వెలుగులోకి వచ్చిన భారీ స్కామ్

అటు అనంతపురం శిశుసంరక్షణ కేంద్రంలోనూ ఓ శిశువు చనిపోయింది. దీంతో అసలేం జరుగుతోందో తెలియాలంటూ ప్రభుత్వం యాక్షన్‌ షురూ చేసింది…! మరణాలకు కారణాలు తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది.పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇద్దరు చనిపోవడం ఏపీలో కలకలం రేపుతోంది.

 AP Govt

తీవ్ర జ్వరం, పచ్చకామెర్లతో ఆ ఇద్దరు విద్యార్థినులు చనిపోగా.. మరో 120 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. అస్వస్థతకు గురైన వాళ్లను విశాఖ కేజీహెచ్‌ (KGH) సహా పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అలాగే ప్రిన్సిపాల్‌ సహా మరో ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు.విషయం తెలిసిన వెంటనే విశాఖ KGHకు వెళ్లి.. చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. (Minister Sandhyarani) పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సంధ్యారాణి.

అలాగే ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రి సంధ్యారాణికి ఫోన్‌ చేయడంతో.. పరిస్థితులను సీఎంకు వివరించారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.మన్యంలో వర్షాలు పడగానే జ్వరాలు విజృంభిస్తాయని.. ఆ వర్షాల కారణంగానే జ్వరాలొచ్చాయన్నారు మంత్రి సంధ్యారాణి.

శిశుగృహంలో ఓ చిన్నారి చనిపోవడం తీవ్ర కలకలం

అలాగే దసరా సెలవులకి విద్యార్థులు ఇంటికి వెళ్లిరావడంతో.. అక్కడున్న నీటి సమస్యల వల్ల ఈ పరిస్థితొచ్చిందన్నారు. మరోవైపు అనంతపురం (Anantapur) లోని శిశుగృహంలో ఓ చిన్నారి చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. సిబ్బంది శిశువు మృతదేహాన్ని పూడ్చేయడం వివాదాస్పదమైంది. అయితే నిజానిజాలు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు కలెక్టర్‌.

అయితే చిన్నారికి గుండె సంబంధిత సమస్యలున్నాయని.. అందుకే చనిపోయినట్లు తెలిపారు మంత్రి సంధ్యారాణి.మొత్తంగా.. రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఆస్పత్రుల్లో చికిత్స విద్యార్థులను వైసీపీ నేతలు కూడా పరామర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh News Breaking News BS Gurukul school tragedy health crisis Kurupam students latest news Parvathipuram Gurukulam incident student deaths Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.