📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

AP: ఆంధ్రా ట్యాక్సీ యాప్ ను తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం

Author Icon By Anusha
Updated: December 21, 2025 • 2:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం వినూత్న నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా మరో వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. అదే క్యాబ్ సర్వీస్. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థల ఆపరేటర్లు అయిన ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి. వాటిల్లో బైక్, కారు క్యాబ్ సర్వీస్ ధరలు భారీ మొత్తంలో ఉంటున్నాయి. ఇక రద్దీ, వర్షం సమయాల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. తక్కువ దూరానికి కూడా అధిక ఛార్జీలు తీసుకుంటున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని ప్రజలు వాడుతున్నారు. 

Read Also: AP: చంద్రబాబు కాన్వాయ్‌లో వైసీపీ జెండా రంగులు..

ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి

ఆంధ్రా ట్యాక్సీ (Andhra Taxi) పేరుతో ఏపీ (AP) ప్రభుత్వం కొత్త యాప్ తీసుకురానుంది.. ప్రైవేట్ క్యాబ్ సంస్థల తరహాలో ప్రభుత్వ ఆధీనంలో యాప్‌ను సిద్దం చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ ఆధ్వర్యంలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ అనే ప్రభుత్వ పోర్టల్/యాప్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. విజయవాడ దుర్గ గుడి, భవానీ ద్వీపం వంటి పర్యాటక ప్రాంతాలకు వచ్చే సందర్శకులకు చౌకగా, సురక్షితంగా రవాణా సేవలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.

AP government is launching Andhra Taxi App

ఆంధ్రా ట్యాక్సీ యాప్ ‌ ద్వారా మోసాలను అరికట్టి, పర్యాటకులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆంధ్రా ట్యాక్సీ యాప్ ద్వారా.. పర్యాటకం వృద్ధి చెందడం మాత్రమే కాక.. వాహనదారులకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్‌ ద్వారా.. ఆటో, క్యాబ్‌లను.. యాప్, వాట్సప్, ఫోన్‌కాల్, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమకు కావలసిన ప్రాంతాన్ని యాప్‌లో నమోదు చేస్తే, అక్కడ రిజిస్టర్ అయిన డ్రైవర్ల వివరాలు కనిపిస్తాయి.ఆ యాప్‌లో కనిపించే డ్రైవర్లను అధికారులు ముందే అన్ని రకాలుగా చెక్ చేసి..

ఆ తర్వాత అనుమతిస్తారు. అలానే రవాణా శాఖ అధికారులు పరీక్షించి, ఫిట్‌నెస్‌ ఉన్న వాహనాలకు మాత్రమే ఈ ఆంధ్రా ట్యాక్సీలో అవకాశం కల్పిస్తారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వాహనాల డేటా, బుకింగ్ సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్లకు చేరేలా ఈ యాప్‌ను రూపొందించారు.యాప్‌లో నమోదైన వాహనాల సమాచారం రాష్ట్ర డేటా కేంద్రానికి చేరుతుంది. దీనివల్ల ప్రయాణికుల వ్యక్తిగత డేటా భద్రంగా ఉంటుంది.విజయవాడతో పాటు ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు రవాణా సేవలతో పాటు, హోటల్ గదులను కూడా ఈ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Taxi AP Government Government Cab Service latest news Telugu News Vijayawada Transport

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.