📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

AP Govt : ఆ సామాజికవర్గానికి శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్

Author Icon By Sudheer
Updated: July 6, 2025 • 8:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాగరాలు లేదా నగరాలు సామాజికవర్గానికి బీసీ-డి కింద కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ పత్రాలు జారీ అవుతున్నప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సామాజికవర్గానికి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని మంత్రి హామీ ఇచ్చారు.

జిల్లాల మధ్య వివక్షపై మండిపాటు

విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో నాగరాలు సామాజికవర్గానికి బీసీ-డి పత్రాలు ఇస్తున్నారని, కానీ మిగతా జిల్లాల్లో అధికారులు పట్టించుకోవట్లేదని మంత్రి సవితకు వర్గ నాయకులు వివరించారు. ఈ పత్రాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోతున్నారని వాపోయారు. అయితే రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా ఒకే విధంగా వ్యవహరించాలని, అధికారుల తీరుపై సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

2008లోనే బీసీగా గుర్తింపు, ఇప్పటికీ సమస్యలు

2008లో నాగరాలు సామాజికవర్గాన్ని బీసీ-డి కింద చేర్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ విడుదల చేసినప్పటికీ, కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఈ వర్గానికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఈ వర్గ జనాభా అధికంగా ఉన్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల వారు తమ హక్కులను వినియోగించుకోలేకపోతున్నారు. తక్షణమే అన్ని జిల్లాల్లో పత్రాల జారీకి చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత స్పష్టం చేశారు.

Read Also : IND vs ENG: టెస్టు సిరీస్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

Ap govt Google News in Telugu Nagaras community

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.