అదనపు కార్యదర్శి ప్రభాకర్రెడ్డి
విజయవాడ : భూ పరిపాలన, ప్రభుత్వ ఆదేశాలపై చట్టాలు పౌరులకు అవగాహన కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. బ్రిటిష్ హయాం నుంచి ఇటీవల వరకు ప్రభుత్వ పరంగా వెలువడిన ఆదేశాలతో మాన్యువల్ ను 14 వాల్యూమ్స్ ను రెవెన్యూ శాఖ (Department of Revenue) తయారుచేసింది. 3706 పేజీలతో తయారైన ఈ పుస్తకాలను సీపీఏల్ష వెబ్సైట్లో ఉంచబోతున్నారు. భూములకు సంబంధించి రాష్ట్రంలో 200 కు పైగా చట్టాలు ఉన్నాయి. వీటి గురించి రెవెన్యూ ఉద్యోగులకే పూర్తిస్థాయిలో అవగాహన లేదు. ఏ సమస్యకు ఏ చట్టం వర్తిస్తుందో అధికారుల్లో కొందరికీ తెలియదు. దీంతో క్షేత్రస్థాయిలో కొత్త సమస్యలు వస్తున్నాయి. కోర్టుల్లో జరిగే విచారణ సమయంలో ఈ వివరాలు అందుబాటులో లేక బాధితులతోపాటు అధకారులూ అవస్థలు పడుతున్నారు.
కార్యకలాపాలే తరచూ
ఇక సామాన్యుల పరిస్థితి మరీ దారుణం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు భూ చట్టాలు, ఉత్తర్వులు, నియామాలను 14 పుస్తకాల రూపంలో సీసీఏల్ సిద్ధం చేసింది. భూ కేటాయింపులు పేదలకు ఎసైన్డ్, ఇంటిస్థలాల పంపిణీ రికార్డ్స్ ఆఫ్ రైట్స్, భూముల పరిరక్షణ, ఆక్రమణల నిరోధం, ఇనాం చుక్కల భూముల, ఇతర వ్యవహారాల గురించి ఈ మాన్యువల్ సిద్దమైంది. సీసీఎల్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కమిటీ గత జనవరి నుంచి పనిచేయడం ఆరంభించింది. 200 కు పైగా చట్టాలు ఉన్నా 50 చట్టాల కార్యకలాపాలే తరచూ జరుగుతుంటాయి. ఇందుకు అనుగుణంగా వాటి వివరాలను సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్ యాక్ట్ (Andhra Pradesh Dated Lands Act) -2017 వచ్చినప్పటి నుంచి హైకోర్టు నుంచి వెలువడిన ఆదేశాల వరకు 53 పేజీల్లో వివరించారు.
ఇతర సమాచారాన్ని
జిల్లాల విభజన ప్రారంభం నుంచి జులై 23,2024 వరకు వెలువడ్డ చట్టాలు, 84 జీఓలతో 346 పేజీల పుస్తకం తయారైంది. ప్రస్తుతం రెవెన్యూ మాన్యువల్ఆంగ్లంలో తయారైంది. ఇందులో పౌరులకు నిత్యం అవసరమైన చట్టాలు, ఇతర సమాచారాన్ని తెలుగులోకి తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుతం సిద్ధంచేసిన వాల్యూమ్స్ లోని సమాచారాన్ని ఏఐ (AI) సాయంతో చాట్బాట్స్ ద్వారా వినే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. భూ పరిపాలనపై తరచూ వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
గ్రామీణాభివృద్ధి,మహిళా సాధికారత,విద్యా, వైద్య రంగాల్లో పురోగతి,,వ్యవసాయ రంగ అభివృద్ధి,ఉద్యోగ అవకాశాల కల్పన,పారిశ్రామికీకరణ.
Mepma-Rapido పథకం ఏమిటి?
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మెప్మా ద్వారా ర్యాపిడో సంస్థతో కలిసి మహిళలకు స్కూటీలు, ఆటోలు ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పథకం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Rangaraya Medical College: ల్యాబ్ టెక్నీషియన్లు నలుగురు సస్పెన్షన్