ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం మరో కీలక పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకంను మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ఈ పథకం ద్వారా, మహిళలు వంట, ప్యాకింగ్, భోజనం పంపిణీ మరియు వ్యర్థాల నిర్వహణ వంటి విభాగాల్లో ప్రధాన బాధ్యతలు చేపడతారు. ఇప్పటికే కడప, (kadapa) జమ్మలమడుగు జిల్లాలలో ఈ పథకం సక్సెస్ అయ్యింది. విజయవంతమైన విధంగా అమలవుతున్నందున, త్వరలో 33 కొత్త స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు.
Read also: YS Jagan: జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల్లో కేసీఆర్-కేటీఆర్
AP Government
మహిళలకు ఆర్ధిక స్వావలంబన
పథకం కింద మహిళలు నేచురల్/ఆర్గానిక్ కూరగాయలు పండించి, వాటిని మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తారు. దీని ద్వారా వారికి నిరంతర ఆదాయం లభిస్తుంది.
ఆర్గానిక్ వ్యవసాయం పై ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది. మండల సమాఖ్యలు ఈ కార్యక్రమంలో సహాయం చేస్తాయి. అదనంగా, ఆర్గానిక్ కూరగాయలను భోజనంలో ఉపయోగించడం వల్ల, పిల్లలకు పోషక విలువలు పెరుగుతాయి. పథకం అమలు ద్వారా మహిళలు ఉద్యోగ అవకాశాలు పొందుతారు, ఆర్ధికంగా బలోపేతం అవుతారు మరియు రాష్ట్రంలో ఆహార ప్రమాణాలు మెరుగుపడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: