విజయవాడ : రాష్ట్రంలోని ప్రముఖ మున్సి ఫాలిటీ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణను ఇందనంగా మారుస్తూ శుభ్రమైన ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. కాకినాడ, నెల్లూరు, కడప, కర్నూలు మున్సి పల్ ప్రాంతాల్లో స్థాపించబడనున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమక్షంలో మంగళవారం జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణకు (Waste-to-energy) అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించి, వాటిని ఇంధనంగా మార్చే దిశగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు పట్టణాల శుభ్రత, పునరుత్పత్తి శక్తి వనరుల అభివృద్ధి సాధనకు వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించనున్నాయి అని అన్నారు.
Read also: Family Survey : ఏపీలో ఈ నెలాఖరు నుంచి ఫ్యామిలీ సర్వే
AP Government
12 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యే
ఈ ఒప్పందాల ప్రకారం నెల్లూరు, కడప, కర్నూలు ప్లాంట్లకు ఏపీఎస్పీడీ సీఎల్, కాకినాడ ప్లాంట్ కు ఏపీ ఈఎస్పీడీసీఎల్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదిరాయన్నారు. డిస్కంల తరఫున ఆంధ్రప్రదేశ్ పవర్ పర్చేజ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రభుత్వం తరఫున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈ సమన్వయం చేపట్టనున్నారు. ఈ ప్లాంట్లు జిందాల్ మరియు ఆంటోని లారా కంపెనీల ఆధ్వర్యంలో నిర్మాణం మరియు నిర్వహణ జరుగనున్నాయన్నారు. కాకినాడ (రామేశ్వరం)లోని 21 మున్సిపాల్టీలు కవర్ అయ్యే విధంగా 957 టన్నుల వ్యర్థ ప్రాసెసింగ్ సామర్థంతో 15 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టును మరియు నెల్లూరు (దొంతాలి)లో 9 మున్సిపాల్టీలు కవర్ అయ్యే విధంగా 604 టన్నులు ప్రాసెసింగ్ సామర్థంతో 12 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టును జిందాల్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రతి రోజూ సుమారు 3,093 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను
అదే విధంగా కడప (కొలుములపల్లి) లో 18 మున్సిపాల్టీలు కవర్ అయ్యే విదంగా 781 టన్నుల వ్యర్థ ప్రాసెసింగ్ సామర్థంతో 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టును మరియు కర్నూలు (గార్వేయపురం) లో 13 మున్సిపాల్టీలు కవర్ అయ్యే విధంగా 751 టన్నుల వ్యర్థ ప్రాసెసింగ్ సామర్థంతో 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టను ఆంటోని లారా కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నాలుగు ప్లాంట్లు ప్రతి రోజూ సుమారు 3,093 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేయనున్నాయన్నారు. టెండర్ల దశలో విజయవాడ, తిరుపతి ప్లాంట్లు 1600 టన్నుల చెత్తను ప్రాసెస్ చేయనున్నాయన్నారు. ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నంలలో ఆపరేషన్లో ఉన్న ప్లాంట్ల ద్వారా 2800 టన్నుల చెత్తను ప్రాసెస్ చేయడం జరుగుచున్నదని, తద్వారా 35 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవు తున్నట్లు ఆయన తెలిపారు.
మొత్తం ఈ ఎనిమిది ప్లాంట్లు కలిపి 7,493 టన్నుల చెత్తను శక్తిగా మారుస్తూ 119 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పేరుకుపోయిన 85 లక్షల టన్నుల చెత్త ఈ ఏడాది అక్టోబరు 2కల్లా పూర్తిగా తొలగించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజూ సేకరించబడే చెత్తను ఎప్పటి కప్పుడు ప్రాసెస్ చేసి ఇంధనంగా మార్చే ప్రక్రియకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, ఈ నేపధ్యంలో ఈ ఒప్పందాలు కురుర్చుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఆడిపి ఎండి కమలాకర్ బాబు, ఏపీపీసీసీ చీఫ్ జనరల్ మేనేజర్ డి. రాజేంద్ర ప్రసాద్, ఏపీఎస్పీడీసీఎల్ ఫ్ జనరల్ మేనేజర్ బి. ఉమాపతి, ఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్. మహేంద్రనాథ్, పిపిసిసి జనరల్ మేనేజర్ పి.ప్రభాకర్, జిందాల్ వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ అధ్య క్షుడు ఎం.వి.చారి, ఆంటోని లారా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎన్. నారాయణరావు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: