నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
విజయవాడ : ఆస్తుల రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగితే వాటిని రద్దుచేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీకి దాఖలు పరుస్తూ కూటమిప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఇది వెంటనే అమలులోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఉత్తర్వులు అందాయి. ఇవి అందిన వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2023 మార్చిలో చట్టసభల ద్వారా ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి (President) ఆమోదం లభించడంతో జారీచేసిన ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు.
సవరించిన బిల్లుకు
సివిల్ కోర్టులకు మినహా అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దుచేసే అధికారి ప్రస్తుతం ఎవరికీ లేదు. దీనివల్ల ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇతర అక్రమ పద్దతుల్లో ఆస్తుల విక్రయాల రిజిస్ట్రేషన్లకు అడ్డుపడడం లేదు. ఈ నేపథ్యంలో అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల నిరోధానికి జాతీయ రిజిస్ట్రేషన్ చట్టం- 1908 ను సవరించిన బిల్లుకు 2023 మార్చి 20న శాసనసభ ఆమోదం తెలిపింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీని అమలు ఉత్తర్వులు ఇప్పుడు వెలువడ్డాయి. రిజిస్ట్రేషన్లు అక్రమ పద్ధతుల్లో జరిగినట్లు ఫిర్యాదులుఅందగానే జిల్లా రిజిస్ట్రార్ (District Registrar) వాటిని పరిశీలిస్తారు, ఆధారల ప్రాతిపదికన కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే కమీటికి సిఫార్సు చేస్తారు. ఈ కమిటీ లో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా రిజిస్ట్రార్ ఇతర అధికారులు ఉంటారు. నిషిద్ద జాబితా నుంచి విడిపించిన 13 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల్లో 25వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి.
కోర్టు ఎటాచ్మెంట్లో
ఇందులో అక్రమాలు జరిగినవి 7వేల ఎకరాల వరకు ఉన్నాయి. తాజా ఉత్తర్వులతో ఇలాంటి రిజిస్ట్రేషన్లను రద్దుచేయడం సులువవుతుంది. నిషిద్ధ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు చేసినా ఒకే ఆస్తికి రెండుసార్లు రిజిస్ట్రేషన్ చేసినా, కోర్టు ఎటాచ్మెంట్లో ఉన్నవాటికి రిజిస్ట్రేషన్లు చేసినా అలాంటి సబ్- రిజిస్ట్రార్ల (Sub-Registrar) కు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. ఈ మేరకు సవరించిన చట్టంలో పేర్కొన్నారు. విధినిర్వహణలో సబ్-రిజిస్ట్రార్ వ్యవహరించిన తీరు వల్ల క్రయ, విక్రయదారులకు నష్టం వాటిల్లినట్లు రుజువైతే ఏడేళ్ల వరకు జైలుశిక్ష విధించవచ్చని ఇప్పటికే అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ చట్టంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు?
ప్రస్తుతం సయ్యద్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) ఎవరు?
కె. విజయానంద్ 2024 డిసెంబర్ 31న ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Shivraj Singh Chouhan: కరవు నివారణకు శాశ్వత చర్యలు