సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం(AP Government) ప్రభుత్వ ఉద్యోగులకు(Government Employees) శుభవార్త అందించింది. బుధవారం ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. దీని ఫలితంగా వివిధ శాఖలకు చెందిన సుమారు 5.70 లక్షల మంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు మొత్తం జమైంది. ఈ చర్యతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Read Also: AP Govt: వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్
పోలీసుల డీఏ ఎరియర్లు, సరెండర్ లీవులు క్లియర్
పోలీసు శాఖకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవులు, డీఏ ఎరియర్లను కూడా ప్రభుత్వం క్లియర్ చేసింది. దీంతో ఏపీ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు.
సంక్రాంతి పండగ సమయంలో బకాయిల విడుదల వల్ల ఉద్యోగుల కుటుంబాల్లో పండుగ ఉత్సాహం రెట్టింపైనట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఈ ఆర్థిక సహాయం ఉద్యోగులకు ఎంతో ఉపశమనం కలిగించిందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: