📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

AP Government: ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక

Author Icon By Rajitha
Updated: January 1, 2026 • 1:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నూతన సంవత్సరం తొలి రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకు నూతన సంవత్సరం, సంక్రాంతి కానుకగా కిలో గోధుమపిండిని కేవలం 20 రూపాయలకే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా బియ్యం, చక్కెర, రాగులు, జొన్నలు వంటి నిత్యావసరాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు గోధుమపిండిని కూడా చౌకధరలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Read also: TTD: గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ

AP Government

దీని వల్ల పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు

ప్రస్తుతం ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. పట్టణాల్లో ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రతి నెల ఒక కిలో గోధుమపిండి అందించనున్నారు. దీని వల్ల పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు ఆర్థిక భరోసా లభించనుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ విధానాన్ని మొదట పట్టణాల్లో అమలు చేసి, అనంతరం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించనున్నారు.

ప్రభుత్వం ఇప్పటికే ఆహారంలో వైవిధ్యం పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. రేషన్ ద్వారా 20 కిలోల బియ్యం తీసుకునే వారు, బియ్యానికి బదులుగా మూడు కిలోలు తగ్గించుకుని రాగులు లేదా జొన్నలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ విధానం కొంతకాలంగా అమలులో ఉంది. తాజాగా నేటి నుంచి గోధుమపిండి కూడా అందుబాటులోకి వచ్చింది. బహిరంగ మార్కెట్లో గోధుమపిండి ధర కిలోకు 60 నుంచి 65 రూపాయల వరకు ఉండగా, ప్రభుత్వం కేవలం 20 రూపాయలకే అందిస్తోంది.

ఇదిలా ఉండగా, రేషన్ కార్డుదారులతో పాటు రేషన్ షాపుల నిర్వాహకులకు కూడా లాభం చేకూర్చేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. చౌక ధరల దుకాణాలను మినీ మాల్స్‌గా మార్చి, రోజంతా రేషన్ సరుకులు అందించే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం కొన్ని నగరాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల రేషన్ తీసుకునే ప్రజలకు, రేషన్ షాపులు నిర్వహించే వారికి రెండింటికీ లబ్ధి చేకూరనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

AP Ration Cards latest news Telugu News wheat flour 20 rupees

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.