ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో పరిపాలన మరింత ప్రజలకు చేరువ కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. తాజాగా ఏర్పాటు చేసిన రెండు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లలో నేటి నుంచే అధికారికంగా పాలనా వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి.. ఇప్పటికే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ జారీకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అలానే కాగా కొత్తగా ఏర్పాటైన పోలవరం, మార్కాపురం జిల్లాలకు తాత్కాలికంగా ఇన్‌చార్జ్ అధికారులను ప్రభుత్వం నియమించింది.
Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు
జిల్లా పరిపాలన కార్యకలాపాలు ప్రారంభం
పోలవరం జిల్లా కలెక్టర్‌గా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మార్కాపురం జిల్లా కలెక్టర్‌గా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారు. పోలవరం ఎస్పీగా అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్‌కు, మార్కాపురం ఎస్పీగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. పోలవరం జాయింట్ కలెక్టర్‌గా అల్లూరి జేసీ తిరుమణి శ్రీ పూజ, మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా ప్రకాశం జేసీ రోణంకి గోపాలకృష్ణ కొనసాగనున్నారు.
పూర్తి స్థాయి అధికారులు నియమితులయ్యే వరకు ఉమ్మడి జిల్లా అధికారులే ఈ కొత్త జిల్లాల బాధ్యతలు నిర్వహించనున్నారు. మరోవైపు ఇప్పటివరకు రాయచోటిలో కొనసాగిన అన్నమయ్య జిల్లా పరిపాలన కార్యకలాపాలు నేటి నుంచి మదనపల్లె నుంచి ప్రారంభమయ్యాయి. కలెక్టర్, ఎస్పీ సహా అన్ని జిల్లా కార్యాలయాలు మదనపల్లెకు మారాయి.అలానే అన్నమయ్య జిల్లాలో ఉన్న రైల్వేకోడూరు నియోజకవర్గం ఇకపై తిరుపతి జిల్లాలో భాగమవుతుంది. కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబుళవారిపల్లె మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో చేరతాయి.
రెవెన్యూ డివిజన్
అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గం, రెవెన్యూ డివిజన్ ఇక నుంచి వైఎస్సార్ కడప జిల్లాలో విలీనమవుతుంది.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తుంది. మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు ఇకపై రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో భాగమవుతాయి. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో విలీనమై, అద్దంకి కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడుతోంది. ఇందులో అద్దంకి, దర్శి నియోజకవర్గాలు ఉంటాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం కూడా రెవెన్యూ డివిజన్‌తో సహా ప్రకాశం జిల్లాలో కలుస్తుంది.
ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లు: అడ్డరోడ్డు జంక్షన్ – అనకాపల్లి జిల్లా అద్దంకి – ప్రకాశం జిల్లా పీలేరు – అన్నమయ్య జిల్లా మడకశిర – శ్రీసత్యసాయి జిల్లా బనగానపల్లి – నంద్యాల జిల్లా జిల్లాల మధ్య కీలక మార్పులు ఇక కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువ కానుంది. కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాల ఏర్పాటు వేగంగా సాగుతోంది. ఈ మార్పులతో పరిపాలనా సామర్థ్యం పెరిగి, ప్రజాసేవలు వేగవంతమవుతాయని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: