AP: విశాఖపట్నంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్ ఏర్పాటు నిర్ణయంపై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ప్రశంసలు కురిపించారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పెద్ద ముందడుగు అని జయప్రకాశ్ నారాయణ (jaya prakash narayana) పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడంలో సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి (central government) కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
AP: రాష్ట్రానికి గూగుల్ రావడం మనకు గర్వం: మంత్రి లోకేశ్
Jp praises AP government
అదే సమయంలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆయన కొన్ని ముఖ్య సూచనలు చేశారు. AP పెట్టుబడులను ఆకర్షించడం ఎంత ముఖ్యమో, ఆర్థిక క్రమశిక్షణ కూడా అంతే అవసరమని చెప్పారు. రాబోయే కొన్నేళ్ల పాటు రాష్ట్రం రెవెన్యూ వ్యయాలను తగ్గించే దిశగా కృషి చేయాలని, అప్పుల భారం నియంత్రణలోకి తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం బడ్జెట్‌యేతర రుణాలు, చెల్లించని బిల్లులు కలిపి రాష్ట్ర అప్పులు స్థూల రాష్ట్రోత్పత్తిలో 60 శాతానికి పైగా చేరుకున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడులను తీసుకురావడంలో ప్రభుత్వం (AP government) చూపుతున్న పట్టుదలను, ఆర్థిక నిర్వహణలోనూ కొనసాగించాలని జయప్రకాశ్ నారాయణ పిలుపునిచ్చారు.
విశాఖలో ఏ ప్రాజెక్ట్‌పై జయప్రకాశ్ నారాయణ స్పందించారు?
గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్ ఏర్పాటు నిర్ణయంపై ఆయన స్పందించారు.
ఏపీ ప్రభుత్వానికి జయప్రకాశ్ నారాయణ ఏమి సూచించారు?
రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించి రెవెన్యూ వ్యయాలను నియంత్రించాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: