📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP: ఏపీ యువతకు శుభవార్త.. ఉచితంగా సివిల్స్ కోచింగ్

Author Icon By Aanusha
Updated: November 13, 2025 • 9:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) యువతకు మరొక అద్భుతమైన అవకాశాన్ని అందించింది. సివిల్ సర్వీసెస్ రంగంలో ప్రతిభ చూపాలనే కల కలిగిన ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులకు ఉచిత శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రోత్సాహం అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొంది.

Read Also: AP: CII భాగస్వామ్య సదస్సుకు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎంవో

ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 340 మంది అభ్యర్థులకు అత్యుత్తమమైన శిక్షణను అందించనున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంస్థల సహకారంతో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల అనంతరం స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి, ఆ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

అంతేకాదు వీరిలో మహిళలకు ప్రత్యేకంగా 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. ఇది మహిళా సాధికారతకు దోహదపడుతుంది. ఈ శిక్షణను విశాఖపట్నం, విజయవాడ,తిరుపతిల్లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లలో అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు 10 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10వ తేదీ వరకు నాలుగు నెలల పాటు శిక్షణ అందిస్తారు.

AP

అర్హులైనవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

ఈ మేరకు అభ్యర్థులకు ఉచిత వసతితో పాటుగా భోజన సౌకర్యం కల్పిస్తారు. ఈ శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం వంటివి తెలుసుకోవడానికి ఏపీ స్టడీ సర్కిల్‌ వెబ్‌సైట్ apstudycircle.apcfss.in అనే వెబ్‌సైట్‌ను చూడాలని సామాజిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి కోరారు.

అర్హులైనవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ తీసుకోవాలంటే రూ.లక్షల్లో ఖర్చవుతుంది.. అలాంటిది ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితగా శిక్షణ అందించబోతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh Government civil services training latest news SC ST candidates Telugu News UPSC free coaching

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.