ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ‘సూపర్ సిక్స్’ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అనేక వాగ్దానాలను నెరవేర్చింది. తాజాగా మరో కీలక నిర్ణయంతో దివ్యాంగులకు తీపికబురు అందించింది.
Read Also: R. Krishnaiah: విజయవాడలో జరగనున్న బిసి ఉద్యోగుల మహాసభను విజయవంతం చేయాలి
ప్రస్తుతం దివ్యాంగులకు(AP) నెలకు రూ.6 వేల పింఛన్ అందిస్తున్న ప్రభుత్వం, వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా కొత్త పథకాన్ని ప్రకటించింది. దివ్యాంగులు స్వతంత్రంగా ప్రయాణించేందుకు వీలుగా ఉచితంగా మూడు చక్రాల రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాలు అందించనుంది.
తొలి దశలో నియోజకవర్గానికి 10 వాహనాలు
దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయస్వామి వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో తొలి దశలో 10 మంది దివ్యాంగులకు ఈ వాహనాలు అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.17.50 కోట్ల నిధులు కేటాయించింది. మొత్తం 1750 మంది దివ్యాంగులకు మొదటి విడతలో ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఈ వాహనాల ద్వారా వారు ఉద్యోగాలు, విద్య, ఇతర అవసరాల కోసం సులువుగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. విశాఖపట్నంలో రూ.200 కోట్ల వ్యయంతో పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో దివ్యాంగులకు వివిధ క్రీడల్లో శిక్షణ అందించనున్నారు. అలాగే ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా 21 సెంచరీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సహకారంతో ఉచిత స్కిల్ ట్రైనింగ్ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ట్రాన్స్‌జెండర్లకు కూడా రేషన్ కార్డులు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఉచిత వాహనాల అర్హతలు ఇవే
దివ్యాంగులకు అందించే ఒక్కో మూడు చక్రాల వాహనం ధర సుమారు రూ.1 లక్ష. ఈ పథకానికి అర్హత పొందాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరి.
- కనీసం డిగ్రీ చదివి ఉండాలి
- వార్షిక ఆదాయం రూ.3 లక్షలలోపు ఉండాలి
- 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలి
- వయస్సు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి
ఈ పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ప్రతి సంవత్సరం దివ్యాంగులకు వాహనాలు అందిస్తామని మంత్రి వీరాంజనేయస్వామి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: