📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

AP: ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Author Icon By Anusha
Updated: January 24, 2026 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఏప్రిల్, మే నెలల్లో చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. బదిలీలు, ప్రమోషన్లు ఆలస్యం కావడంతో ఏర్పడిన అసంతృప్తికి ఈ ప్రకటన కొంతమేర ఊరటనిచ్చింది.పాఠశాల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

Read Also: Public Meeting: నేడు నగరిలో చంద్రబాబు పర్యటన

వేసవి సెలవుల్లో అదనంగా పనిచేసిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైస్కూల్‌ ప్లస్‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం దృష్టికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. వేసవి సెలవుల్లో అదనంగా పనిచేసిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వారం రోజుల్లో వెలువడనున్నాయి.రెగ్యులర్ ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ అయ్యేంతవరకు, క్లస్టర్ టీచర్లు అవసరమైన పాఠశాలలకు మారుతూ పనిచేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

AP: Good news for government teachers

స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్‌కు పదోన్నతులు

బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో, ఉపాధ్యాయుల పాత పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘాలతో ప్రతి వారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల జీతాలకు సంబంధించిన సమస్యలు తలెత్తితే, వాటిని వెంటనే పరిష్కరిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. అలాగే టీచర్లకు పే ప్రొటెక్షన్‌ ఉత్తర్వులు ఇటీవల విడుదల చేశామని కూడా అధికారులు తెలిపారు.

అయితే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్‌ పదోన్నతుల విషయంలో ఉపాధ్యాయ సంఘాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎస్జీటీల నుండి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్‌కు పదోన్నతులు 30:70 నిష్పత్తిలో చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. దీనికి ప్రతిస్పందనగా, సంఘాల నేతలు 70:30 నిష్పత్తి ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ విషయంలో తదుపరి చర్చలు జరిగే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Government Teachers latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.