ఏపీ(AP) ప్రభుత్వం రైతులకు నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ మేరకు కొత్త పట్టాదార్ పాస్(Pattadar Passbook) పుస్తకాలను రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంపిణీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పాస్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ముహూర్తాన్ని ఖరారు చేసి, గ్రామాల్లో ప్రత్యేక సభలు నిర్వహించి అమలు దిశగా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. జిల్లా యంత్రాంగానికి కీలక సూచనలను అందించింది.
Read Also: AP: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సు కండక్టర్లకు పవర్ బ్యాంకులు
పాస్ బుక్స్‌లో QR కోడ్..
ఈ కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలలో రాష్ట్ర రాజముద్ర (Emblem) ప్రదర్శించబడుతుంది. ప్రతి పాస్ బుక్‌లో క్యూఆర్ కోడ్ కూడా ముద్రించబడుతుంది, దీన్ని స్కాన్ చేసి రైతులు తమ భూమి వివరాలను సులభంగా ఆన్‌లైన్‌లో పరిశీలించవచ్చు. రెవిన్యూ శాఖ భూమి రికార్డులను సమగ్రంగా సరిదిద్దే చర్యలు తీసుకుంటోంది.
రీ-సర్వే గ్రామాల్లో ఉచిత పాస్ బుక్స్ పంపిణీ
తొలి విడతలో 21.86 లక్షల పాస్ బుక్స్ పంపిణీ చేయనున్నారు. వీటిని రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు అందజేయనున్నారు. పాస్ బుక్స్‌లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. గతంలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, 6,688 రీ-సర్వే గ్రామాల్లో 2.79 లక్షల దరఖాస్తులను, మిగతా 17,600 గ్రామాల్లో 1.85 లక్షల ఫిర్యాదులను పరిష్కరించారు.
పాస్ బుక్స్ ఉచితంగా రైతులకు అందజేయబడతాయి. అవసరమైతే భవిష్యత్తులో కూడా మార్పులు ఉచితంగా చేయబడతాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే భూమి వివరాలు తెలిసిపోతాయి. ఇక బ్యాంక్ లోన్ల కోసం పాస్ బుక్ చూపించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: