📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

AP: బీసీలకు శుభవార్త.. సూర్య ఘర్ పథకంలో అదనపు ఆర్థిక సహాయం

Author Icon By Pooja
Updated: December 20, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ(AP) ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తూ గ్రీన్ ఎనర్జీకి పెద్దపీట వేస్తోంది. ఈ పథకం ద్వారా వెనుకబడిన వర్గాలు, పేద కుటుంబాలు సొంత ఇళ్లపై సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా అదనపు ప్రోత్సాహం అందిస్తోంది. కేంద్రం ఇచ్చే రాయితీకి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఆర్థిక సహాయం ప్రకటించడం వల్ల లబ్ధిదారులకు డబుల్ బెనిఫిట్ కలగనుంది.

Read Also: AP: ఇవాళ అనకాపల్లికి సీఎం చంద్రబాబు

ప్రత్యేకంగా బీసీ వర్గాలకు రెండు కిలోవాట్ల సోలార్ యూనిట్ ఏర్పాటు కోసం కేంద్ర(AP) సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 వేల అదనపు రాయితీ ఇస్తోంది. దీంతో మొత్తం రూ.80 వేల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇక ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రెండు కిలోవాట్ల సోలార్ యూనిట్లు పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. మూడు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న యూనిట్లపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల వరకు సబ్సిడీ ఇస్తుండగా, మిగిలిన వ్యయానికి బ్యాంకు రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

AP

ఈ పథకం వల్ల బీసీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గుతుందని, వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా పునరుత్పాదక ఇంధన వినియోగం పెరిగి పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకొని సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Green Energy Solar Energy Surya Ghar Yojana Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.