ఆంధ్రప్రదేశ్ (AP) లోని, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ పైప్ లీక్ కలకలం రేపింది. పైప్ నుంచి దట్టమైన పొగ రూపంలో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా పరిసర ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో గ్రామస్తులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఘటన స్థలంలో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గ్యాస్ లీక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Read also: CM Chandrababu: నదీ జలాలు వృథా కాకూడదు
మరోవైపు ఉమ్మడి గోదావరి జిల్లాలలో అప్పుడప్పుడూ ఇలా గ్యాస్ లీకైన ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటున్నాయి. అధికారులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అప్పుడప్పుడూ ఈ తరహా ఘటనలు జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: