రాజంపేట : ఓ దాబా కేంద్రంగా గంజాయి విక్రయించే ముఠాను మల్లూరు పోలీసులు గుట్టురట్టు చేశారు. (AP) ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చి స్థానికంగానూ, లారీల డ్రైవర్ల ద్వారాను సరఫరా చేసేవారు. మన్నూరు సీఐ అ.ప్రసాద్ బాబు వివరాల మేరకు సమాచారం ఇలాఉంది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గంజాయి పై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉక్కుపాదం మోపాలని దేశించారు. అందులో భాగంగా మన్నూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. గంజాయి తాగే వారిపై, విక్రయించే వారిపై నిఘా పెట్టారు. రాజంపేట, పుల్లంపేట మండలాల్లో గంజాయి సరఫరా అవుతుందని తెలిసింది.
Read also: Breaking News: AP: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా చేస్తున్న ముఠా పట్టివేత
బోయినపల్లిలో ఒనోట గుంపులు గుంపులుగా యువకులు ఉన్నారని సీఐకి సమాచారం అందింది. సిబ్బందితో కలిసి దాడి చేశారు. అక్కడ గంజాయి విక్రయించే వారు దొరికారు. 10 కేజీల గంజాయి దొరికింది. (AP) తిరుపతి (Tirupati) జిల్లా వడమాల పేటకు సమీపంలో దాబాలో గంజాయి కేంద్రంగా సరఫరా అవుతుందని బయటపడింది. బీహార్ కు చెందిన రంజిత్ కుమార్ మహదేవ చౌదరి దాబాలో పనిచేస్తూ గంజాయి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి సరఫరా చేసేవారు. స్థానికంగానూ, దాబాకు వచ్చే డ్రైవర్లకు విక్రయించేవారు. పోలీసుల దాడిలో వీరిద్దరితో పాటు వడమాల పేట మండలం లక్ష్మీపురం కు చెందిన రావెళ్ల కృష్ణమోహన్ రైల్వే కోడూరు మండలం సమతా నగర్ కు చెందిన మాడగడపాల దియా, పుల్లంపేట చెందిన దాసరి అరుణ్, కలవాయిపల్లి చెందిన కట్టే ప్రవీణ్ కుమార్ రెడ్డి, రాజంపేట మండలం ఇసుకపల్లి రోడ్లో లక్ష్మీపురంలో నివాసం ఉంటున్న పిడుగు అజయ్ లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఆరు సెల్ఫోన్లు, మూడువేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: