📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

AP: గూగుల్ మ్యాప్స్ వాడి ఆలయాలను టార్గెట్ చేస్తున్న ముఠా

Author Icon By Saritha
Updated: January 21, 2026 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాకుళం జిల్లా (AP) కాశీబుగ్గలోని విజయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.40.25 లక్షల బంగారం, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగలు టెక్నాలజీని వాడుతూ, గూగుల్ మ్యాప్స్ (Google Maps) ద్వారా ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మీడియాకు వెల్లడించారు.

Read also: AP: 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా ఆలయాల్లో చోరీ

(AP) ఆలయంలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని గమనించిన దొంగలు, ఆ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్నారు కిటికీ తొలగించి లోపలికి ప్రవేశించారు. ఆలయంలోని 6.5 తులాల బంగారు నామం, వజ్రాలు పొదిగిన శంఖు చక్రాలు, 15 కిలోల వెండి ఆభరణాలతో పాటు హుండీలోని రూ.80 వేల నగదును అపహరించారు. ఈ ముఠా చోరీకి ముందు, తర్వాత చాలా తెలివిగా వ్యవహరించారు.

AP Gang targeting temples using Google Maps

గూగుల్ మ్యాప్స్‌లో ఏ ఆలయాల్లో ఎక్కువ బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయో గుర్తించి వాటినే లక్ష్యంగా చేసుకున్నారు. చోరీ తర్వాత సాక్ష్యాలు దొరక్కుండా సీసీ కెమెరాల డీవీఆర్ బాక్స్‌ను తీసుకెళ్లి చెరువులో పడేశారు. పోలీసులు దానిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులు గతేడాది అక్టోబరులో జైలు నుంచి విడుదలై, అప్పటి నుంచి రాష్ట్రంలో 50కి పైగా ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడు కురమాన శ్రీనివాసరావుపై 38 కేసులు, ఇతరులపై కూడా పదుల సంఖ్యలో కేసులున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ap gold ornaments Google Maps Kashibugga Latest News in Telugu Srikakulam Telugu News temple robbery temple theft Vijay Venkateswara Swamy Temple

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.