📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP Freehold Lands – ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం..మరో రెండు నెలలు కొనసాగింపు

Author Icon By Anusha
Updated: September 11, 2025 • 8:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల (Freehold land registrations) పై ప్రభుత్వం విధించిన నిషేధం మరోసారి పొడిగింపబడింది. ఈసారి నవంబర్ 11 వరకు ఆంక్షలు కొనసాగనున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. గత 15 నెలలుగా ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రైతులు, భూస్వాములు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఫ్రీ హోల్డ్ భూములు అంటే ప్రభుత్వ భూములను లేదా ఇన్‌మామ్, వక్ఫ్, ఇన్‌అమ్ వంటి ప్రత్యేక భూములను సర్వే చేసి, కేటాయించిన వారికి రిజిస్ట్రేషన్ అవకాశం ఇచ్చే భూములు. గత ప్రభుత్వం ఈ ప్రక్రియలో కొన్ని అనుమానాస్పదమైన నిర్ణయాలు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి. వేలాది ఎకరాల భూములు అనధికారికంగా రిజిస్టర్ అయ్యాయని, ఫేక్ పత్రాలు సృష్టించి కొందరు లాభాలు పొందారని అధికార వర్గాల అభిప్రాయం. ఈ కారణంగానే కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిజిస్ట్రేషన్లపై తాత్కాలిక నిషేధం విధించింది.

రెవెన్యూ శాఖ మాత్రం ఈ సమస్యను పరిష్కరించలేదు

అర్హులైన వారికి వెంటనే న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu) ఆదేశించారు. కానీ రెవెన్యూ శాఖ మాత్రం ఈ సమస్యను పరిష్కరించలేదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటి రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. ఆ తప్పులను సరిదిద్దుతామని ప్రభుత్వం తెలిపింది.. కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 5న ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలపై రెవెన్యూ శాఖతో చర్చించారు. ఒకవేళ ఫ్రీ హోల్డ్‌కు అర్హులైన వారు ఏ పార్టీ అయినా సరే న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారు.

అర్హత ఉన్న అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆయన అన్నారు. 20 ఏళ్ల గడువు దాటిన భూములను ఫ్రీ హోల్డ్ చేయాలన్నారు. రెవెన్యూ శాఖ (Department of Revenue) మాత్రం ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. దీంతో స్థానిక నాయకులు తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా చిన్న రైతులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి అర్హులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో ప్రభుత్వం త్వరగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే బావుంటుంది అంటున్నారు.

ఆలస్యం చేయవద్దని కూడా చంద్రబాబు ఆదేశించారు

అర్హత ఉన్న అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని.. ఆలస్యం చేయవద్దని కూడా చంద్రబాబు ఆదేశించారు. అసైనీలు భూమి పొసిషన్లో ఉండి, సరైన రికార్డులు కలిగి ఉంటే, 20 ఏళ్ల గడువు దాటిన వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా ఫ్రీ హోల్డ్ చేయాలన్నారు.

‘అసైన్‌మెంట్ రికార్డులు లేని భూములు, కలెక్టర్ ఉత్తర్వులు లేనివి, జీవో 596కి విరుద్ధంగా ఉన్నవి, ఎక్కువ విస్తీర్ణం క్లెయిమ్ చేసేవి, ఇతరులు క్లెయిమ్ చేసే భూములు, అభ్యంతరాలున్న పోరంబోకు భూములు, నీటి వనరులున్న పోరంబోకు భూములు, 20 ఏళ్ల గడువు దాటని అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ వద్దు’ అని కూడా చెప్పారు. దాదాపు 7 లక్షల ఎకరాల భూమి అర్హత కలిగి ఉందని గుర్తించగా.. కనీసం వాటినైనా నిషేధం నుండి తొలగించాలని కోరుతున్నారు.

తాజాగా నిషేధాన్ని మరో రెండు నెలలు పొడిగించారు

గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారంపై అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2024 మే నాటికి 13 లక్షల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ అయినట్లు గుర్తించారు. ఇందులో 7 లక్షల ఎకరాలు సక్రమంగా జరిగాయని.. 5 లక్షల ఎకరాల్లో అక్రమాలు జరిగాయని రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ అక్రమాలపై విచారణ జరుగుతోంది.

మంత్రివర్గ ఉపసంఘం అక్టోబరులో నివేదిక ఇస్తామని చెప్పింది. దీంతో దసరా నాటికి నిషేధం ఎత్తివేస్తారని భావించారు. కానీ తాజాగా నిషేధాన్ని మరో రెండు నెలలు పొడిగించారు. దసరా కాదు, దీపావళి పూర్తయ్యాక కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదంటున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/new-responsibility-for-ap-village-and-ward-secretariat-employees/breaking-news/544993/

andhra pradesh land registration ap farmers issues AP Government Decision ap revenue department Breaking News freehold land ban freehold land registrations land ban extension latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.