📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: AP: మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

Author Icon By Anusha
Updated: December 15, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP) , కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకాన్ని రాష్ట్రంలో పునఃప్రారంభించింది. ఈ పథకం కింద, పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నారు. ఈనేపథ్యంలో ఉచితంగా సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం, బిగింపు ఖర్చులన్నీ ఆయిల్ కంపెనీలే భరించనున్నాయి. అలాగే మొదటి సిలిండర్ ఉచితం, ఆ తర్వాత రూ.300 రాయితీ లభిస్తుంది. దీనివల్ల సామాన్యులకు గ్యాస్ వాడకం మరింత అందుబాటులోకి వస్తుంది.

Read Also: Tirumala: కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

ఈ పథకం కింద, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద మహిళలకు 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు.. దీనివల్ల ఎంతోమంది మహిళలకు వంటగ్యాస్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. (AP) రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి, ప్రతి జిల్లాలో ‘జిల్లా ఉజ్వల కమిటీ’ని నియమించారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉంటారు.ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి జిల్లా కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

AP: Free gas connections for women

జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. ఈ కమిటీ పథకం అమలును పర్యవేక్షిస్తుంది. రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారికి, వారి ఇంట్లో ఎటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా ఇవ్వాలి.వలస కార్మికులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వారు కూడా అవసరమైన పత్రాలు సమర్పించి గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు.

అయితే, నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ఆదాయ ధ్రువీకరణ కోసం రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. అర్హులైన పేద మహిళలు దగ్గరలోని ఏజెన్సీల వద్దకు వెళ్లి, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద 14.2 కిలోల ఒక సింగిల్ సిలిండర్ లేదా 5 కిలోల రెండు సిలిండర్లు పొందవచ్చు. అర్హులైన ప్రతి మహిళా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Government free gas connection latest news PMUY scheme Pradhan Mantri Ujjwala Yojana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.