📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: AP Free Bus: మొబైల్ ఫోన్లలో ఆధార్ కార్డు చూపించినా ఉచిత ప్రయాణం

Author Icon By Anusha
Updated: September 24, 2025 • 7:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ మహిళలకు ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందించడానికి స్త్రీ శక్తి పథకం ప్రారంభించబడింది. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 15వ తేదీన విజయవాడలోని ప్రత్యేక కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఐదు రకాల బస్సులలో ఉచిత ప్రయాణం పొందుతున్నారు. ఇందులో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి.

ప్రారంభంలో కొన్ని రూట్లలో మాత్రమే ఈ పథకం అమలులో ఉండగా, ప్రస్తుతం ఘాట్ రోడ్లలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులను చూపించి మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు.అయితే ప్రస్తుతం అన్ని రకాల పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కావటంతో.. ఉచిత బస్సు పథకానికి కూడా ఆధార్ కార్డు ప్రామాణికంగా మారింది.

ఉచిత సదుపాయం ద్వారా ఆ మహిళలకు ఎంతమేరకు లబ్ధి

ఆధార్ కార్డు చూపించి మహిళలు స్త్రీ శక్తి పథకం లబ్ధి పొందుతున్నారు. ఆధార్ కార్డు చూపించిన మహిళలు. బాలికలకు ఆర్టీసీ సిబ్పంది జీరో ఫేర్ టికెట్లు (Zero Fare Tickets) జారీ చేస్తున్నారు. ఈ జీరో ఫేర్ టికెట్ల మీద ప్రయాణించిన దూరంతో పాటుగా ప్రభుత్వం కల్పించిన ఉచిత సదుపాయం ద్వారా ఆ మహిళలకు ఎంతమేరకు లబ్ధి చేకూరిందనే వివరాలు కూడా ముద్రిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలులో మరో కీలక నిర్ణయం తీసుకుంది.

AP Free Bus

ఉచిత బస్సు పథకం అమలు కోసం ఇప్పటి వరకూ మహిళలు తమ ఆధార్ కార్డులను బస్సు కండక్టర్లకు చూపించాల్సి ఉండేది. అయితే ఇప్పుడు తాజాగా ఇందులో మరో సదుపాయం కల్పించారు. ఉచిత బస్సు పథకం కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాలనే నిబంధనల్లో చిన్న మార్పులు చేశారు. మొబైల్ ఫోన్లలో ఆధార్ కార్డు (Aadhaar card) చూపించినా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. డిజిలాకర్ ద్వారా ఆధార్ కార్డు చూపించిన వారికి కూడా ఫ్రీ బస్ జర్నీ సదుపాయం కల్పిస్తారు.

ఆక్యుపెన్సీ పెరగటంతో పాటుగా పురుషుల కంటే మహిళా ప్రయాణికులు

ఈ మేరకు అన్ని ఆర్టీసీ డిపో మేనేజర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులలో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఆక్యుపెన్సీ పెరగటంతో పాటుగా పురుషుల కంటే మహిళా ప్రయాణికులు ఎక్కువైనట్లు అధికారులు చెప్తున్నారు. అలాగే సీట్ల కోసం అక్కడక్కడా గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే స్త్రీ శక్తి పథకం (Women Shakti Scheme) విజయవంతంగా అమలు అవుతోందని ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా మహిళల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

andhra pradesh women welfare ap government transport scheme Breaking News city ordinary buses express buses Free bus travel for women latest news Stree Shakti scheme Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.