📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు మహాజాతర కోసం ట్రాఫిక్ ప్రణాళిక వరుసగా 3 రోజులు సెలవులు మెట్రోకు స్కైవాక్‌లు ఈ రోజు బంగారం ధరలు ఆధార్ కార్డు పోయిందా..? ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత WHO నుంచి వైదొలిగిన అమెరికా ఆస్కార్‌ నామినేషన్స్‌ CBIలో 350 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల 16 నాన్-టీచింగ్, 10 టీచింగ్ పోస్టుల భర్తీ

AP: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం..ఇద్దరి అరెస్ట్

Author Icon By Saritha
Updated: January 23, 2026 • 6:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

(AP) ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాలు పేట్రేగిపోతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పేషీ పేరునే వాడుకుంటూ లక్షలు దండుకుంటున్న ఉదంతం తాజాగా అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసింది. డీఎస్సీలో ఎస్జీటీ పోస్టు ఇప్పిస్తామని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.12 లక్షలకు పైగా వసూలు చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: AP: సైనా నెహ్వాల్‌పై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు

Fraud committed in the name of government jobs; two arrested.

డబ్బులిస్తే ఉద్యోగాలొస్తాయని నమ్మొద్దన్న ఎస్పీ

(AP) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోలుగుంట మండలానికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని నిందితులు నమ్మించారు. ప్రధాన నిందితుడు ప్రకాశం జిల్లా నాయుడుపాలెం గ్రామానికి చెందిన ఎర్రగొర్ల శ్రీను కాగా, ఇతనికి విజయవాడకు చెందిన షేక్ సలీం సహకరించాడు. తనకు సీఎం చంద్రబాబు పేషీలో ఉన్నతాధికారులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయని, కచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీను బాధితురాలిని మభ్యపెట్టాడు. ఇది నమ్మిన సదరు మహిళ నుంచి నిందితులు విడతలవారీగా రూ.12 లక్షలకు పైగా నగదు వసూలు చేసి మోసగించారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ.. ప్రధాన నిందితుడు ఎర్రగొర్ల శ్రీను పాత నేరస్తుడని వెల్లడించారు. గతంలో కూడా ఇతను ఎస్సై, లైన్‌మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన చరిత్ర ఉందని తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎవరైనా ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగితే నమ్మవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలకు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



Anakapalle Police Andhra Pradesh Jobs Scam Chandrababu Naidu Chandrababu Naidu Peshi Government Jobs Fraud Latest News in Telugu teacher recruitment scam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.