ఆంధ్రప్రదేశ్ (AP), అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటెల సుమన (Gantela Sumana) కన్నుమూశారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం తెల్లవారుజామున విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1983లో గంటెల సుమన టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె మృతదేహాన్ని నగరంలోని ప్రియదర్శిని వృద్ధాశ్రయంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆమె మృతితో పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు.
Read also: AP: కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం
చెరగని ముద్ర
1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు ప్రభంజనంలో, తెలుగుదేశం పార్టీ తరఫున పాయకరావుపేట నుంచి పోటీ చేసి, తన తొలి ప్రయత్నంలోనే శాసనసభకు ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే, ఆమె విద్యారంగంపై, ముఖ్యంగా బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. 1984లో నక్కపల్లిలో బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి, ఎందరో విద్యార్థినుల భవిష్యత్తుకు బాటలు వేశారు. ఆమె నిరాడంబరత, ప్రజలకు అందుబాటులో ఉండే తత్వం, నియోజకవర్గ అభివృద్ధికి ఆమె చేసిన కృషిని స్థానికులు నేటికీ గుర్తు చేసుకుంటారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: