ఆంధ్రప్రదేశ్ (AP) లో, గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మధ్యం కుంభకోణం (Liquor Scam) కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో గతేడాది మేలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ అభియోగాలు నమోదు చేసింది. మద్యం కుంభకోణంపై సిట్ నమోదు చేసిన కేసులో ఆయనను ఏ5గా చేర్చారు. ఇప్పటికే రెండుసార్లు సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి, ఈడీ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.
Read Also: Tirupati: మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు ప్రవేశపెట్టాలి
విజయసాయిరెడ్డి వాంగ్మూలం రికార్డు
దాదాపు రూ.3,500 కోట్ల మేర అవినీతి జరిగినట్లుగా భావిస్తున్న ఈ కేసులో ఈడీ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. 2019-2024 మధ్య కాలంలో రూపొందించిన మద్యం విధానంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలపై ఆయన ను, ప్రశ్నిస్తున్నారు. మద్యం కంపెనీల నుంచి వచ్చిన ముడుపులు, షెల్ కంపెనీల ఏర్పాటు, వాటి ద్వారా విదేశాలకు నగదు మళ్లించినట్లు (హవాలా) వస్తున్న ఆరోపణలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా విజయసాయిరెడ్డి వాంగ్మూలాన్నిఅధికారులు రికార్డు చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: