Garikapati Midday Meal Controversy: “అది రాజకీయ నిర్ణయం కాదు.. పిల్లల హక్కు!”: గరికపాటికి విజయ్ ప్రతాప్ రెడ్డి కౌంటర్

Read Time:  1 min
ap-food-commission-chairman-vijay-pratap-reddy-counters-garikapati-midday-meal-comments
ap-food-commission-chairman-vijay-pratap-reddy-counters-garikapati-midday-meal-comments
FONT SIZE
GET APP

Garikapati Midday Meal Controversy: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ, సామాజిక చర్చకు దారితీశాయి. ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం, పుస్తకాలు అందించడంపై ఆయన చేసిన విమర్శలకు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఘాటుగా సమాధానమిచ్చింది.

Read Also: LPG Supply: గ్యాస్ కష్టాలకు చెక్: హోటళ్లు, రెస్టారెంట్లకు ఊరటనిస్తూ కేంద్రం కీలక నిర్ణయం

విజయ్ ప్రతాప్ రెడ్డి వివరణలోని ముఖ్యాంశాలు:

  • జన్మహక్కు: “మధ్యాహ్న భోజనం అనేది ఒక లగ్జరీ కాదు, అది ప్రతి పేద విద్యార్థి జన్మహక్కు. సుప్రీం కోర్టు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేసింది” అని ఆయన పేర్కొన్నారు.
  • చారిత్రక నేపథ్యం: ఈ పథకం ప్రస్థానాన్ని ఆయన వివరించారు:
    • 1960: తమిళనాడు మాజీ సీఎం కామరాజ్ దేశంలోనే తొలిసారిగా ఈ పథకాన్ని ప్రారంభించారు.
    • 1996: దేశవ్యాప్తంగా 5వ తరగతి వరకు ఈ పథకాన్ని విస్తరించారు.
    • 2003: ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ఈ సౌకర్యం అందుతోంది.
  • గరికపాటి విజ్ఞతకే: “ఆయనకు పూర్తి వివరాలు తెలియకపోవచ్చు. ఇలాంటి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను” అని ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ap-food-commission-chairman-vijay-pratap-reddy-counters-garikapati-midday-meal-comments
ap-food-commission-chairman-vijay-pratap-reddy-counters-garikapati-midday-meal-comments

‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉంది. జీవించడం అంటే కేవలం బతకడం కాదు.. గౌరవంగా, ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకొని బతకడం, ఇది అందరి హక్కు. విద్యాహక్కు చట్టం అని మరో చట్టం ఉంది. విద్యాహక్కు అంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, కడుపు కాలుతుంటే.. పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టలేరు. మధ్యాహ్న భోజనం లేకుండా విద్యా హక్కు చట్టం లక్ష్యం నెరవేరదు. స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలని చట్టం చెబుతోంది. పిల్లలకు డ్రై రేషన్ బదులు వండిన భోజనం పెట్టాలని 2001లో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి

దీంతో దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అనేది బలమైన హక్కుగా మారింది. ఇది రాజకీయ నిర్ణయం కాదు, న్యాయవ్యవస్థ బలపర్చిన హక్కు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి’’ అని పత్రాప్ రెడ్డి సూచించారు.‘‘కర్రీ చేసినందుకు గానూ.. 1 నుంచి 5వ తరగతి వరకు చదివే ఒక్కో విద్యార్థికి రూ.6.75 చొప్పున.. ఆరు నుంచి ఇంటర్ వరకు చదివే ఒక్కో విద్యార్థికి రూ.10.17 పైసల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా పిల్లలకు గుడ్లు, పల్లి చిక్కి, రాగి జావ పెడుతున్నారు. రాగి జావ, బెల్లానికి అయ్యే వ్యయంలో 50 శాతం సత్యసాయి ట్రస్ట్, మరో 50 శాతం ఏపీ ప్రభుత్వం భరిస్తున్నాయి’’ అని ప్రతాప్ రెడ్డి తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.