విజయవాడ: ప్రపంచ(Fisheries Day) మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులకు, ఆక్వా రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ సముద్ర తీరం, డెల్టా ప్రాంతం, సరస్సులు, రిజర్వాయర్లు అన్ని కలిపి బ్లూ ఎకానమీలో దేశంలోనే ఏపీని ముందు నిలిపాయని గుర్తు చేశారు. రాష్ట్ర జీఎస్టీపీలోనూ మత్స్య రంగానిదే అగ్ర వాటా అని, దీనికి మరింత మద్దతిచ్చేలా మత్స్య కారులకు, ఆక్వారైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వెల్లడించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల సేవలో పథకం కింద 1 లక్ష 29 వేల 178 మందికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయంగా రూ.259 కోట్లు అందించామన్నారు. గంగపుత్రులు కోరుకున్నట్టుగా 217 జీవో రద్దు చేసి సొసైటీలకే హక్కు కల్పించామని తెలిపారు. గంగపుత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Read also: ఓవర్‌లోడ్ వాహనాలపై తెలంగాణలో కఠిన చర్యలు
ఆక్వా రంగంలో ఆధునిక సాంకేతికత ప్రోత్సాహం
మత్స్యకారులు-ఆక్వా ఫార్మర్లు(Fisheries Day) దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక అన్నారు. మత్స్య ఉత్పత్తి పెంపు, ఆధునిక సాంకేతికత ప్రోత్సాహం కూటమి ప్రభుత్వ లక్ష ్యమని స్పష్టం చేశారు. స్థిరత్వం, సమతుల్యత, నాణ్యత, నీలి విప్లవం సాధించే మార్గం అంతర్జాతీయ పోటీకి ఆక్వా రంగాన్ని సిద్ధం చేసే ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. మత్స్యకారులకు, ఆక్వా ఫార్మర్లకు ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆక్వారంగం బలోపేతానికి 1.50కే యూనిట్ విద్యుత్ అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఆక్వారంగాన్ని ఆంధ్రప్రదేశ్కు ఆశాకిరణంలా తీర్చిదిద్దడమే లక్ష som పని చేస్తామని మాట ఇస్తున్నానని అన్నారు. మత్స్యకారులకు ప్రపంచ మత్స్య కార దినోత్సవం సందర్భంగా మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోం దన్నారు. వేట నిషేధ సమయంలో భృతిని రూ.20 వేలకు పెంచామన్నారు. మత్స్య సంపద అగ్రపథాన నిలుపుతామన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: