📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: AP: రాష్ట్రంలో ఫిన్లాండ్ లోని ఆట ఆధారిత అభ్యాసం..’ ప్రయోగాత్మకంగా అమలు

Author Icon By Rajitha
Updated: November 21, 2025 • 11:59 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: ప్రభాతవార్త ప్రతినిధి: రాష్ట్రంలో ఫిన్లాండ్ (finland) లోని ‘ఆట ఆధారిత అభ్యాసం’ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జిల్లాకు ఒక అంగన్వాడీలో ఫిన్నిష్ పూర్వ శిశువిద్య అమలుకు సహకారం అందించేందుకు ఫిన్నిష్ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఎడ్యుకేషన్ (ఈడీయూ ఎఫ్ ) ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ అథ్వర్యంలో ఐఏఎస్లు నారాయణ, భరతుప్తా, విజయరామరాజు, బి. శ్రీనివాసరావు, గణేష్ కుమార్ లతో కూడిన బృందం ఇటీవల ఫిన్లాండ్ పూర్వ శిశువిద్య విధానం అమలుతో భవిష్యత్ తరాలకు మెరుగైన పునాదులు వేయడానికి మార్గం సుగమం అవుతుందని అధికారుల బృందం పేర్కొంది.

Read also: TTD: టెండర్లు ఎలా కేటాయించారు? సుబ్బారెడ్డిని ప్రశ్నించిన సిట్

ఆట అనేది అభ్యాసానికి మాధ్యమం, విరామం కాదు

ఆంధ్రా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు ఈ విధానం దోహదపడుతుందని వెల్లడిం చింది. ఫిన్లాండ్ లో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఐదేళ్ల మాస్టర్ డిగ్రీ విద్యార్హత తప్పనిసరి. తనిఖీలు, ర్యాంకింగ్ లాంటి వ్యవస్థలు ఉండవు. ఉపాధ్యాయులు తమ భోధనా విధానాలు, మూల్యాంకనాలను వారే నిర్ణయించుకునే స్వయం ప్రతిపత్తి ఉంది. ప్రామాణిక పరీక్షలు లేని మూల్యాంకన విధానం లాంటి అంశాలు విధ్యార్థి మనో వికాసానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. హెల్సింకి విశ్వవిద్యాలయంలోని ప్లేపుల్ లెర్నింగ్ సెంటర్, వర్జియోక్యూలా డేకేర్ సందర్శనలు’ ఆట అనేది అభ్యాసానికి మాధ్యమం, విరామం కాదు.’అనే సూత్రాన్ని రుజువు చేశాయి. పూర్వ శిశువిద్యలో ‘డాన్సింగ్ మౌస్ ఎమోషన్ బోర్డు’ లాంటి సాధనాలు పిల్లల భావోద్వేగ పరిశీలనకు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. ప్రిన్సిపాల్ కు పూర్తి పరిపాలనా అధికారం ఉంటుంది.

ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు

మున్సిపాలిటీలు కేవలం నిధులు, మౌలిక సదుపాయాలకే పరిమితమవుతాయి’ అని పేర్కొంది. హెల్సింకిలోని ఊడి గ్రంథాలయం అమరావతిలో ఏర్పాటు చేసే నాలెడ్జ్ హబ్ కు ఒక బెంచ్ మార్కుగా నిలుస్తుంది. ఫ్యాకల్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్నోవేషన్ స్పింట్లు, డిజైన్ ఫ్యాక్టరీ నమూనా ఆధారంగా ప్రయోగాత్మకంగా ప్రోటోటైపింగ్ హబ్లన ఏర్పాటు చేయడానికి సంస్థలను గుర్తించాం. ఫిన్నిష్ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఎడ్యుకేషన్ మద్దతుతో అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిలో మార్పులు తీసుకురానున్నాం. యూనివర్సిలటీ ఆఫ్ ఆర్ట్స్ హెల్సింకిలో కళల విద్యలో ఉత్తమ పద్దతులు, స్టూడియో ఆధారిత భోధన, మెంటార్షిప్ శిక్షణ, ఆల్టో యూనివర్సిటీలో డిజైన్ ఫ్యాక్టరీలో విభాగాల అనుసంధానం, ఓపెన్ ప్రోటోటైపింగ్ ల్యాబ్స్, స్టార్టప్లకు మెంటా రింగ్ వ్యవస్థలపైన అథ్యయనం చేశాం’ అని తెలిపింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

education finland-model latest news reforms Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.