ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తిరుమల శ్రీవారి దర్శనార్థం పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.గత ప్రభుత్వ పాలనలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అరెస్టైన సమయంలో మొక్కుకున్న మొక్కును ఇప్పుడు తీర్చుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ నెల 19న ఉదయం 9 గంటలకు షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి ‘సంకల్ప యాత్ర’ ప్రారంభిస్తానన్నారు.
Read Also: HYD: Sr. NTR వర్ధంతి.. ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలయ్య
శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి దర్శనం చేసుకుంటా
‘దేశం గర్వించే దార్శనికుడు చంద్రబాబుపై అభాండాలు తొలగిపోవాలని.. జైలు నుంచి ఆయన బయటకు రావాలని సుప్రీంకోర్టు గడపపై నిలుచుని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించా. తిరుమలకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నా. చంద్రబాబు మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించుకున్నారు. ఇటీవలే ఆయనపై కేసులన్నీ కొట్టేశారు. దీంతో నా మనసు కుదుటపడింది. నా కుటుంబం మొక్కు గుర్తుతెచ్చుకుంది. ఇంకా నా గడప నన్ను అడుగుతోంది మొక్కు తీర్చుకోమని.
శేషాచలం కొండ పిలుస్తోంది వచ్చి దర్శించుకోమని. అందుకే అమ్మానాన్నల ఆశీర్వాదాలతో షాద్‌నగర్‌లోని మా ఇంటి గడప ముందు కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర ప్రారంభిస్తాను. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి దర్శనం చేసుకుంటాను. ఇది రాజకీయ యాత్ర కాదు. నా మనోవేదన తీర్చిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి నా మొక్కుబడి చెల్లింపు’ అని బండ్ల గణేశ్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: