📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల

Author Icon By Aanusha
Updated: February 10, 2026 • 10:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు కూటమి ప్రభుత్వం పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 1,200 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం రోజున ఏపీ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఏపీ ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థుల ఖాతాలలో జమ చేస్తే.. కూటమి ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలో వేయాలని నిర్ణయించింది. ఆ మేరకు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేస్తున్నారు.

Read Also: Collector Himanshu Shukla: ప్రభుత్వ బ్యాంక్ ఖాతాలపై కలెక్టర్ సమీక్ష

AP: Fee reimbursement dues released

ఆయా కాలేజీలకు రీయింబర్స్ మెంట్

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ కోర్సుల్లో పూర్తి ట్యూషన్ ఫీజును ఆయా కాలేజీలకు రీయింబర్స్ మెంట్ చేస్తున్నారు. జ్ఞానభూమి పోర్టల్ ద్వారా వీటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులు, మైనార్టీలకు దీన్ని వర్తింపజేస్తున్నారు. ఇందులో ట్యూషన్, స్పెషల్, ఇతర, పరీక్ష ఫీజులను కాలేజీ ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నారు. అలాగే మెయింటెనెన్స్ ఫీగా ఆహారం, హాస్టల్ ఖర్చులకు ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు, పాలిటెక్నిక్‌కు 15వేలు, డిగ్రీ, పైన విద్యార్ధులకు 20 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AndhraPradesh APStudents FeeReimbursement latest news scholarships Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.