हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

AP: యూరియా కొరతతో రైతులకు చుక్కలు

Rajitha
AP: యూరియా కొరతతో రైతులకు చుక్కలు

ఎక్కడా లభ్యం కాకపోవడంతో ఇబ్బందుల్లో అన్నదాత

చిత్తూరు : యూరియా కొరత తీవ్రంగా వుండటంతో పంటలు సాగు చేస్తున్న రైతులకు చుక్కలు కన్పిస్తున్నాయి. యూరియా కోసం అరికెలు, మండల కేంద్రాల్లోని ఎరువుల ఏజెన్సీలు, సహకార సంఘాల వద్దకు వెళ్తున్నప్పటికీ ఎక్కడా యూరియా లభ్యం కాని పరిస్థితి నెలకొంది. పంటల సాగుకు ప్రస్తుతం నీరు సమృద్ధిగా వున్నప్పటికీ యూరియా లేకపోవడంతో పైర్లు ఏపుగా పెరగక పోవడంతో ఈసారి దిగుబడి తక్కువ అవుతుందని రైతులు విలపిస్తున్నారు. ఓ వైపు జిల్లాలో ఒక్క బస్తా యూరియా లభించక రైతులు అల్లాడుతుంటే వ్యవసాయ శాఖ మాత్రం ఇందుకు విరుద్ధంగా రైతులకు సరిపడ యూరియా నిల్వలు వున్నాయని, జిల్లాలో ఎక్కడా యూరియా కొరత అనే మాట లేదని ప్రకటనలు ఇస్తుండటంతో రైతులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

Read also: financial system : ఆర్థికపంథా మారితేనే ముందడుగు

AP

AP

యూరియా కొరత తీవ్రంగా వుంది

గత పది రోజులుగా జిల్లా కేంద్రం. చిత్తూరుతో పాటు పరిసర మండలాలైన బంగారు పాళ్యం, పూతలపట్టు, యాదమరి, జిడినెల్లూరు, గుడిపాల తదితర మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా వుంది. ఈ మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్ళి యూరియా పరిస్థితిని రైతులు అడిగితే మండలానికి అవసరం కంటే ఎక్కువ యూరియా పంపిణీ చేశామని, రైతులు ఇబ్బంది పడకుండా వుండటానికి యూరియా తెప్పిస్తున్నామని, వారం రోజుల్లో రావచ్చునని, వచ్చిన వెంటనే ఆర్బికెల ద్వారా రైతులకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటామనే సమాధానం వస్తోంది.

రబీకి సరిపడ యూరియా 20,183 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక జిల్లాలో రబీ సీజన్ లో పంటల సాగుకు అవసరం అయ్యే యూరియాను పంపిణీ చేయడానికి వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా పరిధిలో 2025-26 రబీ సీజన్లో అన్ని రకాల వంటల సాగు చేయడానికి 20,183 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని గుర్తించి ఆ మేరకు వ్యవసాయ శాఖ ప్రణాళికను తయారు చేసింది. జిల్లాలో ఈ ఏడాది అక్టోబర్ 1నాటికి 2,047 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభ నిల్వలు అందుబాటులో వున్నాయి. డిసెంబర్ 31వ తేదీ వరకు రైతులకు మొత్తం 5,747 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటికే 6,617 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందుబాటు లో వుంచారు.

అలాగే డిసెంబర్ నెలాఖరు నాటికి జిల్లాకు మరో 600 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు అందుబాటులోకి రానుంది. జిల్లాలో ఇప్పటి వరకు 4,217 మెట్రక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయి. ఈ నెల 11వ తేదీ నుండి డిసెంబర్ నెలాఖరు వరకు రైతులకు 1,247 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రస్తుతం 2007 మెట్రిక్ టన్నుల యూరియా ఆర్ఎస్కెలు, మార్ఫెడ్ గోదాములు, రిటైల్, హోల్సేల్ డీలర్లు, కో-ఆపరేటివ్ సొపైటీలు, కంపెనీ గోడౌన్లలో అందుబాటులో వుంది. జిల్లాలో ఇప్పటి వరకు ఎరువుల కొరత లేదని వ్యవసాయ శాఖ పేర్కొంది. అలాగే నానో యూరియా, నానో డిఎపిని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఇవి సాంప్రదాయక ఎరువులకు వంద శాతం ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ప్రోత్సహిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870