News Telugu: AP: నకిలీ మద్యం కేసు: కీలక నిందితుడు తలారి రంగయ్య అరెస్టు

Read Time:  1 min
Fake liquor case
Fake liquor case
FONT SIZE
GET APP

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని నెలలుగా సంచలనం సృష్టిస్తున్న నకిలీ మద్యం కేసులో మరో కీలక అరెస్టు జరిగింది. నకిలీ బ్రాండెడ్ మద్యం బాటిళ్లకు ఒరిజినల్ లాగా లేబుల్స్ సరఫరా చేసిన ఎ14నిందితుడు తలారి రంగయ్యను ఎక్సైజ్ శాఖ సిఐడి అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. అరెస్టు ముందు ముందస్తు బెయిల్ కోసం రంగయ్య ఎపి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారాన్ని కింది కోర్టులోనే తేల్చుకోవాలంటూ హైకోర్టు ఆ పిటీషన్ను కొట్టివేసింది.

Read also: Mumbai Summit: ఫిల్మ్, టూరిజం రంగాల్లో పెట్టుబడులే లక్ష్యం

Fake liquor case

Fake liquor case

రంగయ్యను అదుపులోకి

తర్వాత విజయవాడలోని 6వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో కూడా ఆయన బెయిల్ పిటీషన్ రిజెక్ట్ అయింది. దాంతో ఎట్టకేలకు నేడు ఎక్సైజ్ అధికారులు రంగయ్యను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం తయారీ చైన్లో రంగయ్యదే కీలకపాత్ర అని పోలీసులు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున ఒరిజినల్ బ్రాండ్ల లేబుల్స్ ను అతనే ముద్రించి, నకిలీ మద్యం నింపిన బాటిళ్లకు అతికించేందుకు సరఫరా చేశాడని ఆధారాలు లభించాయి. ఈ కేసులో ఇప్పటివరకు 50కి పైగా అరెస్టులు జరగగా, తలారి రంగయ్య అరెస్టుతో దర్యాప్తు మరింత లోతుగా సాగే అవకాశం ఉంది

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.