అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
సచివాలయం : (AP) రాజధాని ప్రాంతంలో తొలిసారిగా ఈనెల 26వ తేదిన 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ (K. Vijayanand) సంబంధిత శాఖల అధికా రులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సన్నాహక ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈనెల 26వ తేది ఉదయం రాజధాని ప్రాంతంలో తొలిసారిగా బహిరంగ ప్రదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నందున ఆ కార్యక్రమం విజయవంతా నికి వివిధ శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి అవసరమైన సూచనలు జారీ చేశారు. వేడుకల ప్రాంగణంలో తగిన తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, తాత్కాలిక మరుగు దొడ్లు, భారీ కేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారంలేని రీతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయ వంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయా నంద్ ఆదేశించారు.
Read also: AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో లోక్ భవన్, హైకోర్టు, అసెంబ్లీ. రాష్ట్ర సచివాల సిఎం క్యాంపు కార్యాలయం సహా ఇతర ముఖ్య భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. (AP) పోలీస్ శాఖ తీసుకోవాల్సిన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి ఏర్పాట్లపై సూచనలు, సెరిమోనియల్ పెరేడ్కు తగిన ఏర్పాట్లు సక్రమంగా చేయాలని చెప్పారు. ఉద్యానవన శాఖ వేడుకల ప్రవేశద్వారాన్ని పూలతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దడంతోపాటు ప్రవేశ మార్గానికి ఇరువైపులా పూల కుండీలు ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు. సమాచార శాఖ ద్వారా ముఖ్యఅతిధి గణతంత్ర దినోత్సవ సందేశం ప్రచురణ, సరిపడిన ప్రతులు సిద్దంచేసి అందరికీ పంపిణీ చేసే ఏర్పాట్లు చేయా. అన్నారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని అయా శాఖల వారీ శకటాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు, నిరంతరం విద్యుత్ సర ఫరాకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
అత్యవసర వైద్య సేవలు, అంబులెన్స్‌ల ఏర్పాటు
వైద్య ఆరోగ్యశాఖ వేడుకల ప్రాంగణంలో అత్యవసర బృందాలను, అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలన్నారు.. మొత్తం ఏర్పాట్లన్నీ గుంటూరు జిల్లా కలెక్టర్ వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని పర్యవేక్షించాలని సిఎస్ అధికారులకు సూచనలు జారీ చేశారు. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామల రావు, వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. శకటాలకు సంబంధించి ఈనెల 8వ తేది గురువారం వాటికి థీమ్స్ ను సిద్ధంచేసి పంపాలని చెప్పారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ కమిషనర్ కె.కన్నబాబు, ఐ అండ్ ఏఆర్ డైరెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్, ఆర్టిజిఎస్ సిఈఓ ప్రఖర్ జైన్, జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సా రియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, అటవీ దళాధి పతి డాక్టర్ పి.వి. చలపతిరావు, ప్రొటోకాల్ అదనపు డైరెక్టర్ మోహనరావు పాల్గొన్నారు. పర్చువల్గా ఎంఎయుడి ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, అదనపు డిజిపే శాంతి భద్రతలు మధుసూదన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, కమీషనర్ జి.వీరపాండ్యన్, ఆర్ అండ్ ఐ, ట్రాన్స్కో, ఉద్యానవన, అగ్నిమాపక, ఆర్మీ. ఎన్సిసి తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: