📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AP: ప్రభుత్వ శాఖల్లోఉద్యోగాల భర్తీకి కసరత్తు!

Author Icon By Aanusha
Updated: February 2, 2026 • 11:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఉగాది నాటికి రాష్ట్ర జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి, దాని ప్రకారం వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.మంత్రి నారా లోకేష్ ఈ మేరకు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో అధికారులు శాఖల వారీగా ఖాళీలపై వివరాలు సేకరిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ పెద్ద సంఖ్యలోనే ఉండొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఉద్యోగ ఖాళీలతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగుల లెక్కలను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం.

Read Also: Tirumala: శ్రీవారిని దర్శించుకున్న భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు

ఉగాదికి షెడ్యూల్ ప్రకటించే అవకాశం

రెవెన్యూలో 13,000, విద్యలో 7,000, వర్సిటీల్లో 3,000, PRలో 26,000, మున్సిపల్‌లో 26,800, అగ్రికల్చర్‌లో 3,000, స్కిల్ డెవలప్‌మెంట్‌లో 4,200 ఖాళీలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 90,000 వరకు ఉద్యోగ ఖాళీలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర శాఖల వివరాలను కూడా సేకరిస్తున్నారు.

AP: Exercise to fill jobs in government departments!

అయితే గతేడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవటంతో.. ఈ సారి మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ విభాగాల నుంచి ఖాళీ పోస్టులకు సంబంధించిన వివరాల సేకరణ ప్రక్రియ పూర్తైన తరువాత ఉగాదికి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AP Government Jobs Job Calendar AP latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.