AP: ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంది: పవన్ కల్యాణ్‌

Read Time:  1 min
AP: ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంది: పవన్ కల్యాణ్‌
FONT SIZE
GET APP

ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంటుందని, హిందూ దేవుళ్లను, ధర్మాన్ని కించపరిచినప్పుడు మౌనంగా ఉండకుండా తమ గళాన్ని వినిపించాలని ఆంధ్రప్రదేశ్ (AP) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) పిలుపునిచ్చారు. సగటు హిందువు మనస్తత్వంలో మార్పు రావాలని, భయంతో లేదా సౌలభ్యం కోసం మౌనంగా ఉండే ధోరణిని వీడాలని ఆయన సూచించారు. దేవుడిపై భయం, విశ్వాసంపై గౌరవం ఉన్నప్పటికీ, మన ధర్మాన్ని ఎవరైనా దురుద్దేశంతో అపహాస్యం చేసినప్పుడు కేవలం వ్యక్తిగతంగా బాధపడి, కర్మకు వదిలేసి ముందుకు సాగే అలవాటు మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Read Also: AP: కార్మికులకు సంక్షేమ పథకాలు మళ్లీ ప్రారంభం

AP: ప్రతి భక్తుడికీ ధర్మాన్ని కాపాడే బాధ్యత ఉంది: పవన్ కల్యాణ్‌
Every devotee has the responsibility to protect righteousness: Pawan Kalyan

(AP) హిందువుల్లో ఈ ఉదాసీన వైఖరి మారాలని, కుల, ప్రాంత, భాష విబేధాలున్నా హిందూ ధర్మం ఒక్కటేనని, హిందూ ధర్మంపై దాడి జరిగితే హిందువులంతా గొంతెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడమంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండటం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమ సొంత విశ్వాసాలను, సంప్రదాయాలను కాపాడుకోవడం మాత్రమేనని ఆయన వివరించారు. హిందువులు తమ ధార్మిక బాధ్యతను గుర్తించి, సోమరితనం వీడి, తమ విశ్వాసాల పరిరక్షణకు సమిష్టిగా ముందుకు రావాలని ఆయన ఆయన ట్వీట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.